ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టుతానని చెప్పి, ప్రబోధానందా అని చెప్పడము జరిగినది. తల్లితండ్రులు పెట్టినపేరు పెద్దన్న అయితే ఆధ్యాత్మికములో గురువు పెట్టిన పేరుగా ఈ పేరునుంచుకోమని చెప్పడము జరిగినది.


అప్పటినుండి పెద్దన్న అను పేరు పూర్తిగా లేకుండా పోయినది. ప్రపంచ వ్యవహారములలో గుత్తా ప్రబోధానంద చౌదరిగా వ్యవహరించగా ఆధ్యాత్మిక విద్యలో ప్రబోధానందగా ప్రారంభమై తర్వాత కొంత కాలమునకు ప్రబోధానంద యోగీశ్వరులుగా చెప్పబడినది. ఒక స్వామివద్ద మంత్రో పదేశమును తీసుకొనినా, ఆ మంత్రమును ఆయన ఎన్నడూ జపించలేదు. మంత్రములు ఉపదేశములుకావు అని ముందునుంచి చెప్పుచున్న ఆయన గురువు పెట్టిన పేరును తీసుకొన్నాడుగానీ, మంత్రమును తీసుకోలేదు. ఆయన వైద్య వృత్తి ద్వారా ప్రజలలో కొంత పేరును సంపాదించుకొనినా సాటి కులములోగానీ, సాటి బంధువులలోగానీ ఏమాత్రము గుర్తింపు లేకుండెడిది. తన 25 సంవత్సరము నుండి వైద్యవృత్తిని చేయడముగానీ, జ్యోతిష్యమును చెప్పడముగానీ చేయలేదు. ఒకే ఒక దైవజ్ఞానమును తప్ప దేనినీ చెప్పనని అనుకొన్నాడు. అప్పటినుండి ఎవరికైనా ప్రాణాపాయస్థితిలో వైద్య సలహాను చెప్పాడుగానీ, వైద్యమును చేయలేదు. అలాగే జ్యోతిష్యము తెలిసినా ఎవరికీ చెప్పలేదు. తనకు ఎన్నో విద్యలు తెలిసినా ఏ విద్యనూ వాడుకోక సర్వసాధారణముగా బ్రతుకుచూ ఎవరి నుండి డబ్బును ఆశించక, జ్ఞానమును గ్రంథరూపములో వ్రాస్తూ తనకు తెలిసిన వ్యాపారములను చేస్తూ చేయిస్తూ కాలమును సాగించెడి వాడు. మనుషులలో సామాన్య మనిషిగా, ఏ గుర్తింపూ లేకుండా బ్రతుకుచూ ఆయన వ్రాసిన గ్రంథములలో కొన్ని సందర్భములలో ప్రబోధానంద యోగీశ్వరులుగా తన పేరును వ్రాయడము జరిగినది. కొంత కాలమునకు భగవద్గీత గ్రంథమును

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Gutta.pdf/17&oldid=279902" నుండి వెలికితీశారు