ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాచీనమైనవీ, యిప్పుడు వాడుకలో లేకుండా నశించినవీ అయిన అనేక శబ్ద ప్రయోగాల సరళిని తెలిపే వ్యాకరణాలు వున్నాయి. ఇవి ప్రస్తుత కాలానికి ఉపయోగపడకపోయినప్పటికీ ప్రాచీన భాషా ప్రయోగ సంప్రదాయాలను గ్రహించడానకు ఉపకరిస్తాయి. అయితే శబ్దానుశాసన మనే వ్యాకరణం ప్రాచీనమైనది. కాని ప్రాచీన కాలం నుంచీ ఆధునిక కాలం వరకు గల భాషా ప్లవాన్ని గురించి ప్రస్తావించే అవకాశాన్ని ఈ శబ్దానుశాసనం కలిగివున్నది. శబ్దానుశాసనం లోని సూత్రాలను ప్రస్తుత కాలానకు కూడా అనువర్తింపజేసుకోవచ్చును అని పై వాక్యాల తాత్పర్యం. Some what curious statements are made in works that have come to hand regarding the constituent parts that combine to form Kannada. Thus the unknown author of Subhasthita or Neetikanda an old Jain work says" ఒళుగన్నడ బెళుగన్నడ తెళుగన్నడ అచ్చగన్నడం సక్కజముం ఎళగన్నడ హళగన్నడ సలెదేశియ కెనెయదుణ్ణి కన్నడికిళియోల్ Local (or home) Kannada, white Kannada, clear Kannada, and derivatives from Sanskrit young (or new) Kannada, old Kannada, being combined in the lan- guage of the country, is there any equal to Kannada in the world?" ఏ అంతర్భాష వలన కన్నడమేర్పడినదో వాటిని గురించి తెలుసుకోదగ్గ కొన్ని వింత సంగతులు యిప్పుడు మనకు లభించిన గ్రంథాలలో కనిపిస్తున్నవి. సుభాషిత అనే ప్రాచీన జైన గ్రంథకర్త పేరెవరో తెలియదు కాని, ఆయన యిలా వ్రాస్తున్నారు : ఒళు, బెళు, తెళు, అచ్చ, ఎల, హళ మొదలైన కన్నడములు దేశభాషతో కలిసిపోయినవి. కన్నడ భాషకు సరితూగగల మరివొక భాష లోకమున కలదా? లేదని పై వాక్యముల సారాంశము. హళగన్నడ మనగా పాత కన్నడమనీ తెళుగన్నడమనగా తేట అయిన కన్నడమని అర్థము. ఇదే విధముగా ఈ శతాబ్ద ఆరంభమున దేవచంద్రునిచే రాయబడిన “రాజావలి కథై” అను గ్రంథమున యిట్లు కలదు. దేవచంద్రుడు జైనుడు. హళగన్నడ బెళుగన్నడ వళగన్నడ పొసతెంబుదుం తెళుగన్నడ మిశ్రదీనిద నిశెయోళు సత్పురుష రోడికేళ్వుడు సతతం. గురుజాడలు భట్టకలంకుడు 621