ఈ పుటను అచ్చుదిద్దలేదు

పద్య సంఖ్య ఒప్పు చప్పరంబు 10 17 తప్పు చెప్పరంబు వెల్లకల్లె ఒక్కటి పలుకకయుండు 18 ఒక్కటే పలుకకయుండి 29 శతావధానులు గారు నా పద్యములందు మూడు పెద్ద తప్పులు పట్టినట్లు కనబడుచున్నది. ఒకటి, నేను గ్రాంథిక భాషా వ్యాకరణమును పాటించలేదని, రెండు, ఛందశ్శాస్త్రమును పాటించ లేదని, మూడు, పద్యములలో కావ్య గుణములు లేవని. కావ్య గుణములు ఒకరిసొమ్ము కావు. లక్షణ గ్రంథములెంత చదివినను, అందలి అలంకారాదులు తమ కబ్బమునందెంత యెక్కించవలెనని ప్రయత్నించినను, అనేకమంది పండితులు మనసును రంజించు కావ్యములు వ్రాయలేదు. అది వారి పాండిత్యముననొక లోపముగా తలచకూడదు. కావ్య గుణములు ముఖ్యముగా ప్రతిభ వల్లనూ, కొంతవరకు కావ్య పఠనా కళా జ్ఞానము వల్లనూ, కొంతవరకు పూర్వకవుల కావ్యరసము మనసును పట్టి, ప్రవర్తింపజేయుట వల్లనూ కలుగును. అది అలా వుండగా, గుణ గ్రహణము కూడా కొంతవరకూ అలవాటును పట్టేయుండును. ఇంగ్లీషు సంగీతము సహించని ఇంగ్లీషు వారెందరో గలరు. ఒకవేళ మన లక్షణ గ్రంథములనే తీసి, యీ యీ గుణములు యీ యీ పట్ల పట్టినవని, యెత్తి చూపినను, శతావధానులు గారు అంగీకరింతురని నే తలచను. ఇక మన లక్షణ గ్రంథములలో కానరాని కావ్య గుణముల మాటో, లక్షణ గ్రంథములలో చెప్పడమునకు శక్యము కాని కావ్య గుణముల మాటో, చెప్పనేల? గ్రాంథిక భాషా వ్యాకరణమును అనుసరించని తెనుగు వ్రాతలు శతావధాని గారికి అసహ్యములై యుండును. ఇందును గురించి అట్టే చర్చించిన వినియోగము వుండదు. ముత్యాలసరముల మాట అటుండనియ్యండి. ఆంధ్రభారతి యందు ప్రచురించిన వ్యాసము లలో రెండు మూడు దక్క తక్కినవన్నియు తమ స్తుతి, తామే యొనరించవలెనట. బుద్ధిశాలులును, గద్య ప్రబంధ రచనాచణులును అగు ఆంధ్ర భారతీ విలేఖకుల వ్రాతలు శతావధాని గారికి మనస్కరించకపోవుటకు కారణము యూహింపజాలను. శతావధానులు గారు, ఛంధశ్శాస్త సంస్కారము నెత్తిరి. అట్టి సంస్కారమునకు నే చూపినది దారి కాదనిరి. ఛందశ్శాస్త సంస్కారము శతావధానులు గారికి అభిమతమైనట్లే కానవచ్చుచున్నది. ఛంధశ్శాస్త్రమనగా తెలుగున లాక్షణికులు చేసిన నియమములని వారి యభిప్రాయము కావచ్చును. లేకున్న శాస్త్రమునకు సంస్కారమన్న మాటీవరకు విని యుండలేదు. ముత్యాల సరాల లక్షణము గురుజాడలు 616