ఈ పుటను అచ్చుదిద్దలేదు

లాటినుకూ, యిటాలియనుకూ ఆనాడు వుండే భేదం, సంస్కృతముకూ, ప్రాకృతములకూ వుండిన యట్టిది. కొంతవరకు గ్రాంథిక తెనుగుకూ, వాడుక తెనుగుకూ వున్న భేదం వంటిది. వుత్తర దేశాలలో సంస్కృత ప్రాకృతములనే గాని, దేశ భాషలలో రాయడం పరువు తక్కువని పండితులు చాలాకాలం తలచేవారు. ఇప్పుడు ఆ భ్రమ తరిగిపోయింది. బంగాళీలలో లేనేలేదు. రవీంద్రనాధుని ఆదరించడముకు సాహిత్య పరిషత్తు భవనంలో సభ అయినప్పుడు: “యిప్పటి బంగాళీ కవులు సంస్కృత కవులుగా మారినారు” అని వొకసందర్భములో అన్నాడు. తెలుగు దేశంలోనూ యిట్టి చిక్కుమునుపు కలిగింది. ఇప్పుడు కలుగుతుంది. సంస్కృతాన్ని పట్టి అప్పుడు కలిగింది. గ్రాంథిక భాషను పట్టి యిప్పుడు కలుగుతుంది. ఆంధ్రశబ్ద చింతామణికర్త అన్నాడు: “స్వస్థాన వేష భాషాభిమతా.....” తొలికాలపు నాటి తెలుగు కవులు తాము ఉభయ భాషా కవులమని చెప్పుకోకపోతే గౌడు మూకలో కలుపుతారేమో అని, “ఉభయ భాషా కావ్యరచనాభిశోభితు”, “ఉభయకవి మిత్రు” అని తమ సంస్కృత పాండిత్యము వెల్లడించుతూ వుండేవారు. తెనుగులో కూడా కావ్యములు రాస్తే ప్రత్యవాయం లేదని అధర్వణుడు చాటభారతం రాశాడు. భట్టకలంకదేవుడి శబ్దానుశాసనం యిప్పుడు దొరకడం కష్టం. 1890 సంవత్సరంలో మైసూరుగవర్నమెంటువారు అచ్చువేశారు. ఇది వొక గొప్ప కన్నడ వ్యాకరణం. దీనిని గురించి రైదొర వ్రాసినారు. " "The date of its completion as given at the end of the work corre- sponds with 1604 A.D. it is thus from its period, not an antique treatise dealing with archaisms and absolete terms; interesting as a literary monu- ment, though of citter practical value now, but has the advantage of treat- ing of the whole range of the language down to the modern period and its rules are such as apply to the present times." కన్నడమునకు వ్యాకరణమేల? అనే విషయమును, భట్టకలంకుడు యిలాగున చర్చించాడు:- మంగళశ్లోకం “నమః శ్రీవర్ధమానాయ విశ్వవిద్యావబాసినే ! సర్వభాషామయా భాషా ప్రవృత్తా యన్ముఖాంబుజాత్”. విద్యా పునరుజ్జీవనము గురుజాడలు 609