ఈ పుటను అచ్చుదిద్దలేదు

తగియున్నవనియు నభిప్రాయపడి, యింపయిన కావ్యములు తక్కువ స్థితిలో నుండు మనుజుల సుఖ దుఃఖముల గూర్చి వ్రాసిరి. వర్డ్సువర్లు అందుచేతనే ఒక గొల్లవాడి బ్రతుకును గూర్చి కావ్యము వ్రాసెను. మన పండితులీ కావ్యమును జూచినచో “ఇదియా కావ్యము; ఒక గొల్లవాడు కొండలవెంట దిరిగెనట. వాని కుమారుడు చెడు తిరుగులు తిరిగి దేశాంతరగతుడాయెనట. తండ్రి మందకు పాకకట్ట నారంభించి దుఃఖముచే గాంచలేకపోయెనట. ఇదియా కావ్యమునకు తగిన కథ?” అని నవ్వుదురు? పుట్టుకవల్ల గొప్ప రానేరదు. గుణయోగ్యతల వలననే గొప్ప వచ్చును. పెద్ద యవస్థలో నుండు దుర్జనుని కన్న తక్కువ స్థితిలో నుండు సజ్జనుడు నిజమైన గొప్పవాడు కాడా? టెన్నిసన్ అనెను : "Kind hearts are better Than coronets and served Faith than Norman blood" పెద్ద ప్రభువులై యుండుట కంటే దయగల హృదయము కలిగియుండుటే శ్రేష్టము. రాజరక్తము కన్న నమ్మిన నీతియే శ్రేష్టము. బర్ను కవియనెను : "Rank is but the guinea stamp The man is the gold for all this" " లోకములో యెక్కువ అవస్థ అనునది తెచ్చిపెట్టు కున్నది. నాణెముపై ముద్దర వంటిది. మనిషే బంగారము. అనగా గుణయోగ్యతలను బట్టి మనిషికి కలుగును. గానీ ఉద్యోగము వలన, ధనధాన్యముల వలన పెద్దింట పుట్టుట వలన కలుగనేరదు. మైకేల్ అను గొల్లపిల్లవాడు అట్టి బంగారము. గుణ సంపదచే ఎన్నికైన మనుష్యుడు. గురుజాడలు 605 కవిత్వము : వర్డ్సువర్తు