ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిత్వము: వర్సు వర్తు వర్డ్సు వర్తు కవిత్వమునకును, అంతకు పూర్వము కవిత్వము వ్రాసిన ఇంగ్లీషు కవీశ్వరుల కవిత్వమున కును చాల భేదము కలదు. అతనికి ముందు పదునెనిమిదవ శతాబ్దమున నుండిన కవులు రెండు నిశ్చయములు చేసికొనియుండిరి. అవి యెవ్వియనిన (1) కావ్యమున నుపయోగించు మాటలు (Poetic Diction) నాజూకు గను లలితముగను నుండవలయు ననియు (2) కవిత్వమున వర్ణించతగిన వస్తువులు (Subjects) కూడ సామాన్యమైనవి కాక నాజూకు గాను, లలితముగాను, గొప్పవిగాను నుండవలయుననియు. మనలో కూడా కావ్యములు లోకములో వాడుకలో లేని గ్రాంథిక భాషలోనే వ్రాయవల యునని లక్షణములు వ్రాసిన కవుల నిర్ణయము. అటుల గాక, సామాన్యమగు వస్తువులను గూర్చి, వాడుకలో నుండు మాటలలో కవిత్వము చెప్పి కవితా సామర్థ్యము వలన వానికి సొంపు తెచ్చి చదువరుల మనసుల రంజింప చేయ వచ్చునని వర్డ్సువర్తుని అభిప్రాయము. అట్లని నాజూకు మాటలనతడు ఉపయోగించక పోలేదు. నాజూకగు సంగతుల గూర్చి కావ్యములు వ్రాయకపోలేదు. ఇతని కాలము నుండి ఇంగ్లీషు కవిత్వము తోవయే మారి మిక్కిలి గొప్ప స్థితికి వచ్చినది. మన దేశపు కవులు కావ్యములలో వర్ణించు పాత్రములు, దేవతలు, దేవతా స్త్రీలు, రాజులు, రాజకుమారికలు, పెద్ద యింటి పురుషులు, స్త్రీలు, వీరి చర్యలు అవస్థలనే వర్ణింతురు. అందులో కథానాయకులకు (Heroes of the poem) లోకములో కానరాని గుణ సంపత్తి, పరాక్రమాదులు, సౌందర్యమును ఆరోపింతురు. తక్కువ జాతి వారిని గూర్చి వర్ణించి వ్రాయరు. కవిత్వమున వ్రాయతగిన చర్యలు అట్టి తక్కువ మనుష్యుల బ్రతుకులలో నుండనేరవని మన దేశపు కవుల అభిప్రాయము. వర్డ్సువర్తుకు పూర్వపు కవుల అభిప్రాయము కూడా కొంతవరకట్టిదియే. ఆధునిక కవులు అటుగాక మనుష్యుల సుఖ దుఃఖములు అన్నియును వొక్కలాటి వేయనియు, మనిషి అయివుండుటలో వకని తక్కువ, వకని హెచ్చు లేదనియు, సుగుణములు, సత్ప్రవర్తన గొప్ప అవస్థలో నుండువారికిని, తక్కువ అవస్థలో నుండు వారికి సామాన్యములనియు, కావ్యములను రసవంతము చేయుటకు రాజుల, రెడ్ల, బ్రాహ్మణుల చర్యల వర్ణన యెటుల తగియున్నదో, రయితుల యొక్కయు, తక్కువ జాతుల వారి చర్యలు కూడా నటులనే గురుజాడలు కవిత్వము : వర్డ్సువర్తు 604