ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“కుఱ్ఱవాళ్ళకి ఆకలి లావు. సాయీబు గారూ! యీ వూళ్ళో చేబ్రోలు వారుండాలి; వున్నారా? ఈ దేవాలయం దగ్గిరే వారి బస వుండేది. అనగా యిప్పుడు మీ మసీదగ్గరే!”

ముసల్మాను స్వచ్చమగు తెనుగు నవలంబించి “లేద”నెను.

“అయ్యో! మా పెద మావఁ రామావధానులు చిన్నమామ లక్ష్మణ భట్టు దేశాంతరగతులై నారా? మృతులైనారా?

సాయీబు చేత నుండి చిలుము నేలరాలి ముక్కలై నిప్పులు నలు దెసలా చెదర, 'నారాయణా! అని సమ్మోదముగా పిలిచెను.

గురుజాడలు

546

మతము : విమతము