ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహేబుగారు వచ్చారు!
మహదొడ్డవారువై!
మోటవారేమి చేస్తారో!
భయం వేయుచున్నది!
గంజాయి పీల్చు మార్గాన!
వొళ్ళు తెలియక యుందురు ఇత్యమరః

(దాసీ ప్రవేశించి కొండుభొట్లు చెవిలో)

దాసీ : సాయిబుకు తెలుగువచ్చునా?

కొండు : వక్క అక్షరం రాదు. రెండు నెలలు కాలేదు ఢిల్లీ నుంచి వచ్చాడు.

సాహె : ఢిల్లీ క్యా బోల్తేజీ,

కొండు : ఢిల్లీ బాద్షాకె అబ్ భాయి బంధుకర్కె బోల్దియా.

సాహె : (లేచి వచ్చి వెన్నుమీద గట్టిగా చరిచి)

తు అచ్చా బొమ్మన్ హై.

కొండు : చచ్చానురోయి. నీ అమ్మా శిగతరగా!

మంజు : (తెర అవతల నుంచి) సాయిబుని వెళ్ళిపొమ్మను. వెధవ కసాయి వాడిలా వున్నాడు. తోళ్ల వాసన కొట్టుతున్నాడు.

సాహె : క్యాబోల్తేజీ!

కొండు : ఫిట్మె దర్ద్ హైకర్కె బోల్తే

సాహె : ఝూటాబాత్ దగాకర్తెతో తుమ్ముమార్తె (అని ముష్టియెత్తును)

కొండు : వాణ్ణి పొమ్మన్నమాట

చెప్పజాలనువై
తురకః కరకశ్చేవ
ద్యానేతౌ మలమోచకౌl
తురకాడు కరక్కాయ
పేరు చెప్తే విరోచనం!
నీవు రాకుంటే వీడ్నించీ
యింటికి మెల్లిగానువై!
జారిపోతాను లేకుంటే
నాకిక్కదాబోరు దక్కదు||

గురుజాడలు

514

కొండుభొట్టీయము