ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఆచరించవలసి వచ్చినప్పుడు రీజన్ కాగినవారు బ్రహ్మ సమాజము యొక్క మార్గము వదలి హిందూ శాస్త్ర ప్రకారం ఆచరిస్తారు - అది యేమనవచ్చును?

కేశవ : నిజమే గాని మాధవయ్య గారు సవబు మాలిన పనిచేసిననూ మళ్ళించడము శక్యము కాదు గాని తాము విధవా వివాహమునకు ఫర్ (for) గాని, ఎగనెష్టు (Against) గాని వున్నట్టు కానరాదు - తమవంటి పండితులు ఆ రిఫారం (refom) విషయమయి చర్చించి యేదో వకనిశ్చయము తీసుకు వుండకపోతే......

ది.రా : అన్ని పనులు అందరూ చెయ్యడము శక్యమా? మత సంస్కారము అందుతో సంబంధించిన గ్రంథ రచనా నా బ్రతుకుకు నిధానములుగా నిర్నయించకు వున్నాను - చేయవలసిన పనులు లోకములో మెండు కలవు. చేయ జేసుకొనిన పని చాయశక్తుల చేయనగు అందు విద్య అన్య వ్యాపార నిరోధి (Jealous wife) ప్రస్తావనవశాత్తూ విధవా వివాహముల మాట అంటిని గాని, ఆ భారము కూడా వహించుటకు నా భుజములకు వైశాల్యముజాలదు. మాధవయ్య గారూ, తమలాంటి వారు పట్టి యుండగా నా రిఫార్ము (refom)కు మరియొకరి సహాయమావశ్యకము కాదు - గాని నా మనసునకు కలిగిన సందేహము నివారించుకోజాలక మాధవయ్య గారి మతమునకు ఆచరణకు గల వైరుధ్యము తాము సమన్వయించగలుగుదురని అడిగితిని.

కేశవ : రాత్రింబొగళ్ళు నేనిదే ఆలోచించుతాను - వారు వినరు - యేమి చెయ్యను. నేను కూడా మోరల్ కరేజ్ (moral courage) లేనివాడిలా లోకానికి కనపడుతున్నాను.నా శతృవులు నన్ను తరుచుగా వెక్కిరిస్తూ వుంటారు.

ది.రా : మాధవయ్య గారు గొప్ప గ్రంథకర్తలు. సంఘ సంస్కార నిర్వాహకులు. వారికి మన మందరమూ పూజ చేయవలసినదే వారి పేరట చంద్రకాంత శిలాప్రతిమ ఒకటి నిలపనగును గాని తప్పుత్రోవను మనల నీడ్చుకు పోయి హాస్యాస్పదులనుగా జేసి నప్పుడు నేనయిన నేమిచేతును? పెళ్ళి చేసుకునే కుర్రవాడు బ్రహ్మసమాజ మతస్తు డైనప్పుడు సమాజ మందిరములో సమాజపద్దతి ప్రకారం పెళ్లి చేయించుదును.మాధవయ్య గారేమి చేయుదురు?

కేశవ : తమరిచ్చిన సలహా బాగా వున్నది. సంఘ సంస్కార సమాజం వారము చాలామందంతా బ్రహ్మ సమాజము వారమే. మేము నలుగురమూ కలసి మా మత ప్రకారం వివాహము చెయ్యడమునకు నిశ్చయిస్తే మిగిలిన ముచ్చకాయ ముగ్గురూ యేవిఁచెయ్యగలరు? అందులో మా స్కూలు కుర్రవాళ్లు మా పక్షం వుంటారు కద. ఓట్లు మెజారిటీ యే

గురుజాడలు

502

కొండుభొట్టీయము