ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యింతట్లో రత్నాంగి కాళ్ల చప్పుడవును. శెట్టి మంచం మీద పడుకుని దుప్పటి తీసి కప్పుకొనును. రత్నం తలుపు తీసి గదిలో ప్రవేశించి సరుకులు వేపు చూచి - కాసులు పోగుచేసి)

రత్నాంగి : యేమిటీచిత్రం కాసులు సగానికి సగం తగ్గిపోయినాయి? (నిలుచుని నాలుగువైపులా చూచును. మంచంమీద మనిషి వుండడం చూసి గతుక్కుమని రెండడుగులు వెనక్కువేసి ఆంజనేయదండకం పఠిస్తూ “శ్రీమన్మహా అంజనీగర్భ సంభూత - సద్బ్రహ్మచారీ - కపీంద్రాదివంద్యా - కిరీటోజ్వలద్రత్న” రత్నాంగి దుప్పటీ ముసుగుతీస్తుంది. గాఢ నిద్రలో వున్నట్టు శెట్టి కదలడు. రత్నాంగి బాగా మనిషిని, నఖసిఖ పర్యంతం పరీక్షించి మొలదగ్గర చెయ్యి పెట్టును - శెట్టి తటాలున రత్నం తలపట్టుకొని)

శెట్టి : దొరికావు మరొగ్గను - చెప్పు - అమ్మవారివా? అసిరమ్మవా? పీడవా? పిశాచానివా? ఆ! యేమిటీ వాళకం చెప్పు - నిశిరాత్రి వేళ యిటొస్తావు అటొస్తావు నీకేం నేనాశ్శకరా! పరాశ్శకరా! వోలమ్మా యిదియేవూరు? యేలోకం? నా కొంపలో నా పక్క మీద నీను పల్లకపడుకున్న ముండా వాణ్ణి అమాంతంగా యెత్తి తెచ్చి యిక్కడ పడేసినావు గదా గుండెబద్దలయి సవ్వనా? రామసాని నీకేటి కావాల? ఒక్క మాట చెప్పు, యేటపోతు కావాలా? నీ రూపం చూస్తే నాకు భయం వేస్తున్నాది. కళ్లు మూసు కున్నాను. తల్లీ రక్షించు.

రత్నాంగి:చదవవలస్ని పాఠంవంతా అయిందా? యింకా వుందా?

శెట్టి : అయితే మనిషివే? యెవరమ్మా నువ్వు? చెప్పు - నా యిల్లు చేర్చు తల్లీ మా వాళ్ళు బెంగ బెట్టుకుంటారు - రత్నాంగివా? అయితే బతికాను. (పలు ప్రక్కలా పరికించి) యిది రామసాని చీకటి గది కాదు? పిశాచమై పీక్కు తింటూంది! నన్ను తెచ్చి పడేసినట్టే నీన్నూ తెచ్చి పడేసిందా ఏమిటి? యిక్కడుంటే మన్ని చంపేసి పోగలదు! రా! పైకి పోయి మంత్రగాడి కాళ్ళట్టుకుని ప్రాణం బచాయించుకుందాం.

రత్నాం : తల వొదిలెయి.

శెట్టి : చూశావా నా చేతులు యెలా గజగజ వొణుకుతున్నాయో? భయం చేత వళ్లు కంపం పట్టుకుంది... నా వశవాఁ చేతులు వొదల్డానికి. (రత్నాంగి పెనుగులాడి మొల దగ్గిరకి చెయ్యి పోనిచ్చును)

శెట్టి : చెయ్యి మాత్రం మొలలోకి వెళ్లనియ్యకు. దోపిడే? సానిబుద్ధిపోతుందా? పిశాచం పీక్కుతింటావుంటే సరసానికి యాళా?

గురుజాడలు

495

కొండుభొట్టీయము