ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండు : కేశఖండన వుత్సవానికి చెప్పినట్టు చెపుతున్నావు. మాత్రం గడపవా? ముందు నీకెంతో పనికి వస్తాను సుమా.

రత్నాం : అలా అయితే కొస కొంచం కత్తిరించి వొదిలేస్తాను; అది మాత్రం తప్పదు.

కొండు : అయితే కానీయి !

రత్నాం : (జుత్తు కత్తిరించును. )

కొండు : కొనేమిటి! మొయ్యా కత్తిరించేశావు.

రత్నాం : వెంట్రుకల కేవిఁటి! తరిగినకొద్దీ పెరుగుతాయి, బలువు తగ్గింది.

కొండు : యీ అవమానంతో నలుగుర్లో యెలా తలెత్తి తిరగడం ? దాని సిగ్గోసినసిగ పోతే పోయింది. కొంచెం ఆసరా యిచ్చి పైకి లేవదియ్యి. కాళ్లు కొంకర్లు పోయినాయి.

రత్నాం : మొదట యెలా దిగావు ?

కొండు : తలుపు తాళం రాగానే శరీరాన్కి యెక్కడలేని లాఘవం వొచ్చి హనుమాన్లులా యెగిరి లోపల్కి జారాను గానీ వొళ్ళు కొట్టుకుపోయింది.

రత్నాం: రాలేకపోతే అలాగే వుండు.

కొండు : యేం యీలాంటి కాఠిన్యం వహించావు? (కొండుభొట్లు అంచులు చేతపట్టి ఉబక ప్రయత్నించగా జాడీ పగిలిపడును. (కొండుభట్లు పెంకుల మధ్య కూలబడును.) చంపావు! (రత్నాంగి కొంత కనికారముతో లేవతీసును. )

వొళ్ళంతా గాయాలు తగిలాయి గాని, నీ కరస్పర్శ తగలగానే అమృతనిష్యందనం లాగ-(కుంటుతూ తలుపు వేపు నడుచును. తలుపు దగ్గర నిలచి ధనం వేపు చూచి) ధనం కాళ్ళతన్నుకు పోతున్నావు. లేక నాతో వంతుకూడ్డం యిష్టం లేదు గాబోలు - నా మట్టుకు కొత్త నీరూ పాత నీరూ కూడా యేకంగా కొట్టుకుపోయినాయి - నా వుంగరం దొబ్బినందుకు లేడా దేవుడు (అంటూ తలుపు గడియ తీసును, రత్నాంగి తను కూడా తలుపు దగ్గరకి వెళ్లి తలుపు తానే వేస్తూ)

రత్నాంగి:నిన్ను ఒక్కణ్ణీ పైకి వదలనే - గదిలో వున్నానంటే పైని గొళ్ళెం వేసి కొంపకగ్గిపెట్టగలవు. గనుక నిన్ను వీధిలోకి సాగనంపి వీధి తలుపు గడియ వేస్తాను (రత్నాంగి గదిపైన గొళ్లెం వేసి కొండుభొట్లుతో పైకి వెళ్లును)

(బోనిపెట్టి తలుపు యెత్తి కోమటి రంగన్న పెట్టి పైకి వచ్చి సరుకులు పరీక్షించి అందులోంచి వుంగరాలు తీసి చేతిని పట్టుకొని కొన్ని కాసులు మొలను దోపుకొనును.

గురుజాడలు

494

కొండుభొట్టీయము