ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ్మూ: నేను బ్రహ్మ సమాజంలో కలిశాను.

కొండి : బ్రహ్మ సమాజం ఏమిటి? విష్ణుమతం, శివమతం అని సృష్ట్యాది నుంచి విన్నాం కాని, బ్రహ్మకి పూజెక్కడేడిసింది. పోనియ్యి: యే సమాజమయినా యెవణ్ణో మనదేవుణ్ణే పట్టుకుని కిరస్తానంలో కలియకుండా వుంటే చాలు.

రామ్మూ: కిరస్తానమతం అసత్యమతం - దాల్లో బుద్ధిమంతుడెవడూ కలియడు.

కొండి : అదిగో! ఆ మాత్రం మంచిమాట అన్నావంటే నాకు పరమానందం (కౌగలించుకొని) మున్సబీ పరీక్ష కోసం తెల్లవాళ్ల చదువు చదువుదు గాని, స్వేత ముఖులు కల్పించి మతం చెడగొట్టాలని వ్రాశిన సంగతులు ఒకటయ్నా నమ్మవద్దు. యివిగో యిరవై రూపాయ్యీలు తెచ్చాను. ఇవి కట్టి పరీక్షకు వెళ్లు.

రామ్మూ: (రూపాయీలు పుచ్చుకొని) సానింటికి వెళ్లడం మానేస్తే బాగుండును.

కొండి : మరో పరమార్థం మాట మనస్సులో వుంచు కోవాలి. విన్నారా? జాజిమొక్కకి పేడవగైరా అసుద్ధ పదార్ధములు వేస్తే మొక్క పెరిగి, పరిమళ భరితములగు పూలు పూస్తుంది. చెట్టుకి పేడవేశామని పుష్పాలకేమయినా అపవిత్రత వచ్చిందా? అవి దేవుడి నెత్తిమీద పెడతాం. అషువలెనే యే మాయోపాయం చేతనైనా ద్రవ్యం సంపాదించి పెద్ద అవస్తలోనికి వచ్చిన తరువాత వుచితంగా ధర్మంచేస్తే పాపాలన్నీ దహించుకుపోతాయి. నీ పెళ్లి అయిన తరువాత శివ పంచాక్షరీ మంత్రముపదేశం చేస్తాను. దాంతో ఐశ్వర్యము, ముక్తి కూడా లభిస్తాయి. పాపాలు యెగిరిపోతాయి.

రామ్మూ : (ఆత్మగతం)

కాష్టవాదం వల్ల కార్యం లేదు. యెంతయ్నీ పెద్దవాడు తండ్రిగదా (ప్రకాశం) అలగే.

(ఇద్దరూ నిష్క్రమింతురు.)

గురుజాడలు

475

కొండుభొట్టీయము