ఈ పుటను అచ్చుదిద్దలేదు

 పాదము యొక్క ఆజ్ఞాకరుడు కావడం అత్యుత్కృష్ట పదవి అన్నాడు. ఒక్కొక్క విలాసినియొక్క వాక్కులయందు ఈశ్వరుడు అనిర్వచనీయమైన రమణీయకత వుంచాడు. వెనుకటికి మా దేశంలో ఒక దరద్దేశపు స్త్రీని చూచాను. దాని మాటలు విని విని చెవికి మత్తెక్కి ఆ స్థలంనుంచి లేచిరావడం కష్టమైంది. మహారాజ కుమారికా వారి వాఙ్మాధుర్యము, ఆ మాధుర్యమును వెయ్యిరెట్లు మీరియున్నది. అదుగో మళ్ళీ కుమారా! బొమ ముడిపడ్డది రాజపుత్రికల యొక్క రమ్యతను యెన్నుటకు ఈ బ్రాహ్మడి తల తగునా అని కదూ! సంతోషమే. పైకి అండమే కదూ తప్పూ, మాటలయొక్క మంజులత విని చెవి ఆనందించినది, ఆనందించినది అని పైకి అనడంలో నా తప్పు యేమి; చంద్రమండలము ఆకాశమందు వున్నది. దాని కాంతికి కళ్ళు మూసు కొమ్మంటే యెవడి శక్యం. కాని పదిహేను రోజులాయె నేను గీత చెబు తున్నాను. ఇన్నాళ్ళూ వారు మౌనమవలంబించారు, నిన్ననే మాటాడారు, వారు మాటాడగానే ఆ మాటలయొక్క ఆనందం యొక్క భావము, వేదాంత శాస్త్రవేద్యమై శబ్దజాలములో కప్పబడి యెక్కడా కానరానప్పటికీ యెప్పుడో లభ్యమవుతుందని యీ జన్మమట్టుకు వృధా అని అట్లు బ్రహ్మానందము యొక్క అభావము కనపడి, ఆహా ఎందుకు ఈ పుస్తకాలు? ఇవి వున్నాయనే ఆనందం యెక్కడా కనబడదు. ఈమె మాటలు వినడమే బ్రహ్మానందం. ఈమె వాక్కులయందే అత్యంతమైన శబ్దప్రమాణము అని నిశ్చయించాను.

రణ : మీ కల్పనా చాతురికి సంతోషించాను.

బిల్హ : యేమి కల్పనాచాతురి. ఆ వాఙ్మాధురి వర్ణన శబ్దమునకు పట్టుపడనిదే. అభూతోపమ.

రణ : వారిని చూస్తి రా!

బిల్హ : చూడలేదు. చూడడమేలా? దేవుణ్ణి చూస్తున్నామా? వాడి మహిమ ప్రపంచ మంతటనూ చూసి అత్యాశ్చర్యపడుతున్నాము కామా? మనిషిని చూడకుండా మాటల వల్ల సమ్మోహమును పొందుతూ వుండుటలో ఒక అనిర్వచనీయమైన సొగసు వున్నది. మరి వక చమత్కారము చెబుతాను. తరుచు స్త్రీ వ్యక్తులలో అంగమునకు అను రూపమైన అంగసౌష్టవము ఉండుట కష్టము. స్త్రీ నడుచుకు పోతూవుంటే ఆ నడకా, అంగములూ అతి రమ్యముగా కనబడుతాయి. ముఖం చూస్తే జాదూ విరిగిపోతుంది. కనుక దేవుణ్ణి చూడకుండా సృష్టి వైచిత్రిని చూచి ఆనందించినట్టే ఆమెను చూడకుండా ఆమె మాటలలో నిమగ్నమై పోవడం మాబోటి కవులకు బ్రహ్మానందము.

గురుజాడలు

459

బిల్హణీయము