ఈ పుట ఆమోదించబడ్డది



బిల్హణీయము

మొదటియంకము - ఒకటవ స్థలము

అనిహిల్లా పట్టణములో రాజు ఆస్థానము

(వైయాకరణుడు నారాయణభట్టును, బిల్హణుని

మిత్రుడగు తార్కికుడు, కేశవభట్టును ప్రవేశింతురు. )

నారాయణభట్టు : మహాభాష్యానికి ఇతని తండ్రి వ్రాశిన వ్యాఖ్యానం ప్రమాణంగా యెవరు వొప్పుతారండీ! ఆలాగైతే నా శిష్యులు వ్రాసిన వ్యాఖ్యానాలు కూడా ప్రమాణవేఁ! యేవంటారు?

కేశవభట్టు : వాదానికి యుక్తి ప్రధానం గానీ పుస్తకాలతో యేంపనండీ!

నారా : యుక్తిలో నీరస సారసాలు కనిపెట్టే దాతేడండీ? ప్రభువులు నూతన ప్రియులు, ఆశ్రయించుకున్న వాళ్ళను క్షూణత పరచడమూ, పరాయి వాణ్ణి నెత్తికెక్కించు కోవడమూ వారికి నైజగుణం.

కేశ : గొంగళీలో తింటూ వెంట్రుకలు లెక్కపెట్టాడట! యిప్పుడు క్లూణత మనకు కొత్తగావొచ్చిందా యేమిటండి భోజరాజు కాలంనుంచీ కవిత్వం విలవ హెచ్చింది; శాస్త్రాలు అడుగంటాయి. నాలుగు శ్లోకం ముక్కలు అల్లుతారనే కదా రామశాస్త్రిని కృష్ణ స్వామిని రాజు యిప్పుడు మన అందరి నెత్తిమీదా కూచోబెట్టాడు.

నారా : వెధవ కవిత్వం! నా శిష్యులు చెబుతారు అంతకన్న మెరుగ్గాను, పరిశీలించేవాడే డండీ?

కేశ : గనక మనకు యిప్పుడు కొత్తగా వచ్చిన క్షూణత లేదని నా మతం. బిల్హణుడికీ, మీకూ స్నేహం కలుపుతాను రండి?

నారా : అయితే వాడి కాళ్ళు పట్టుకోమంటారా యేవిఁటి?

కేశ : ఏవీఁ, బిల్హణుడు, రామశాస్త్రీ కృష్ణస్వామీ పాటి పండితుడూ, కవీ, కాడనా మీ అభిప్రాయం ?

గురుజాడలు

425

బిల్హణీయము