ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీశం : నేనన్నమాటా అదే కదూ? ఆయన చెప్పినట్టు నువ్వేవిఁటి? నేనేవిఁటి, యవరైనా వినవలసిందే, యీ రెండు సంగతుల విషయమయీ, ఆయన సలహా తప్పకుండా అడిగి, వారు యలా శలవిస్తే అలా చేదాం. యేవంటావు? లుబై : యిప్పటి నా చిక్కుకు పనికొచ్చే మాట ఒక్కటి లేదుగద. గిరీశం: మరి యెందుక్కొచ్చా ననుకున్నావు యింత దూరం? నేను నాడు వ్రాసిన వుత్తరపు సంగతులు నువ్వు ఆలోచనలోకి తెచ్చి వుంటే, యీ చిక్కులు నీకు రాకపోను గదా? లుబై : అప్పుడు గడ్డితిన్నాను. (హెడ్డు కనిష్టీబు, దుకాణదారు ప్రవేశించి) హెడ్డు : అవుధాన్లు - ఈయనెవరు? లుబై :

నా తమ్ముడు.

హెడ్డు : నాకేం తోచకుండా వుంది బైరాగీ మాయవైఁ పోయినాడు. లుబై : అయ్యో! మరేవిఁటి సాధనం? హెడ్డు : అదే ఆలోచిస్తున్నాను. లుబా : యెక్కడికి వెళ్ళాడో? హెడ్డు : శ్రీ జగన్నాధస్వామి వారి శలవౌతూంది అని యీ వుదయం నుంచీ అంటూ వొచ్చాడు. దుకా : సారా దుకాణాల్లో యెతికితే, దొరుకుతాడు. హెడ్డు : అదేం మాట భాయీ, సిద్ధులు యేం జేసినా, వారికి తప్పులేదు. యే దుకాణంలోనూ కూడా కాన రాలేదు. ఆలాగైతే అనకాపిల్లి రోడ్డు కాసి యెతకండి. గిరీ : బైరాగి యెందుకయ్యా? హెడ్డు : ఆయన అంజనం వేసి గుంటూరు శాస్త్రుల్లునీ, వాడి కూతుర్ని చూపించాడు. గిరీ : డామ్ నాన్సెన్సు - గ్రోస్ సూపర్ స్టేషన్ యీ వెట్టి కబుర్లు యేదొర నమ్ముతాడు? హెడ్డు : దొర్లు నమ్మకపోతే పోయేరు. ఆ గుంట బతికి వుందనీ, ఫలానా చోట వుందనీ మనకి ఆచోకీ తెలిస్తే చాలదా? గిరీశం : ఇగ్నోరెన్స్! యేమి ఆచోకీ తెలిసింది? హెడ్డు : ఆ పిల్ల ఒక వూరి యింట్లో కుక్కి మంచం మీద కూచుని యేడుస్తున్నట్టు కనపడ్డది. దుకా : గురుజాడలు 400 కన్యాశుల్కము - మలికూర్పు