ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : యెంత మంచివాడు? కరట : అంత మంచి మనిషి మరి లోకంలో లేడు. మధు : ఆయన్ని నాకు చూడాలనుంది. తీసి కెళ్తారా? కరట : నా ఆబోరుంటుందా? ఆయన సానివాళ్లని చూడరు. మధు : ఆంటీ నాచ్చి కాబోలు? కరట : యింగిలీషు చదువుకున్న వాళ్లకి కొందరికి పట్టుకుంది యీ చాదస్తం! అయినా అందులోనూ దేశ కాలాలను బట్టి, రకరకాలు లేకపోవడం లేదు. మధు : సౌజన్యారావు పంతులు గారిది యే రకం? గిరీశం గారిది యే రకం? కరట : యేమి సాపత్యం తెచ్చావు ? కుక్కకి గంగి గోవుకూ యెంతవారో, వాడికీ ఆయనకు అంతవార. సౌజన్యారావు పంతులుగారు కర్మణా, మనసా, వాచా, యాంటీనాచి. “వేశ్య” అనే మాట, యేమరి ఆయనయదట పలికితివట్టాయనా, “అసందర్భం” అంటారు. ఆయనలాంటి అచ్చాణీలు అరుదు. మిగిలినవారు యధాశక్తి యాంటీ నాచులు. ఫౌంజు ఫౌజంతా, మాటల్లో మహావీరులే. అందులో గిరీశం అగ్రగణ్యుడు. కొందరు బంట్లు పొగలు యాంటీనాచి, రాత్రి ప్రోనాచి; కొందరు వున్న వూళ్లో యాంటీనాచి, పరాయివూళ్లో ప్రోనాచి; కొందరు శరీరదార్థ్యం వున్నంతకాలం ప్రోనాచి, శరీరం చెడ్డ తరువాత యాంటీనాచీ; కొందరు బతికివున్నంత కాలం ప్రోనాచి, చచ్చిపోయిన తరవాత యాంటీనాచి; కొందరు అదృష్టవంతులు చచ్చిన తరవాత కూడా ప్రోనాచే. అనగా యజ్ఞం చేసి పరలోకంలో భోగాలికి టిక్కట్లు కొనుక్కుం టారు. నాబోటి అల్ప ప్రజ్ఞ కలవాళ్లు, లభ్యం కానప్పుడల్లా యాంటీనాచె. మధు : మీ యోగ్యత చెప్పేదేవిఁటి! గానీ, హెడ్డు గారి మాటలు చూస్తే, సౌజన్యారావు పంతులు గారు లుబ్ధావధాన్లు గారిని కాపాడడానికి, విశ్వప్రయత్నం చేస్తూ వున్నట్టు కనపబడుతుంది. యేమి కారణమో? కరట : చాపలు యీదడానికి, పిట్టలు యెగరడానికి, యేం కారణమో అదే కారణం. మధు : పరోపకారం ఆయనకు సహజగుణమనా? కరట : కాకేవిఁ? మధు : మీరెందుకు, కొంచెం ఆ యీదడం, యెగరడం నేర్చుకోకూడదు? కరట : నీ మాట అర్థం కాలేదు. గురుజాడలు 377 కన్యాశుల్కము - మలికూర్పు