ఈ పుటను అచ్చుదిద్దలేదు

హెడ్డు : అయితే నా సలహా విన్నారా? రామ యేదో చెప్పండి మరి. హెడ్డు : ఆ కంటె యిచ్చిందాకా, కదలకుండా, లుబ్ధావుధాన్లు యింటిమీద కూర్చోండి. రామ : యిదా సలహా? వీకమీద కూచున్న దాకా నాకేం పట్టింది? యింటికెళ్లి సుఖంగా పడుకుంటాను. హెడ్డు : మధురవాణి బాధ పెడుతుందని కదూ? రామ : అని మీకు కనికారం కాబోలు? రేపు గానీ వాడు కంటె యివ్వకపోతే, అవుధాన్లు మీద సివిల్ దావా పడేస్తాను. మీ దగ్గిర, కంటె మాట వొప్పుకున్నాడు గదా, మిమ్మల్ని సాక్ష్యం వేస్తాను. హెడ్డు : ఓహో! యిదా వేషం? పోలీసు ఆఫీసర్ని నేను, సాక్ష్యాలకీ సంపన్నాలకీ తిరిగితే నా నౌఖరీ నిలుస్తుందా? కావలిస్తే లుబ్ధావుధాన్లు కంటే హరించాడని నా దగ్గిర ఫిరియాద్ చెయ్యండి. కేసు చేసి నా తమాషా చూపిస్తాను. రామ : కంటె మాట మీ దగ్గిర అతడు వొప్పుకున్న తరవాత, మీరు బోనెక్కి యలా అబద్ధం ఆడగలో చూస్తాను గదా. హెడ్డు : పంతులూ, అక్కరమాలిన లౌక్యాలు చెయ్యకు. వాడు కంటె మాట తనకేవీఁ తెలియ దన్నాడు. కావలిస్తే ఆ మాట సాక్ష్యం పలుకుతాను. రామ : యిదా మీరు చేసిన సాయం? హెడ్డు : యెందుకు అక్కరమాలిన ఆందోళన పడతావయ్యా - రేపు నీ కంటే నీ యింట్లో వుండకపోతే నన్ను అను. రామ : మధురవాణితో యిప్పుడు యేం జెప్పను? హెడ్ : అయితే నన్నేం జేయమంటారు? రామ : మళ్లీ లుబ్ధావధాన్లు యింటికి రండి. యీ మాటు మనవిఁద్దరం వెళ్లి పీడిద్దాం. హెడ్డు : రెడొచ్చాడు, మొదలాడు అన్నాట్ట - నిరర్ధకంగా రాత్రల్లా నిద్దర్లేకుండా చంపావు. మరి నేను రాజాలను. నువ్వెళ్లి వాడి యింటి మీద కూచోవయ్యా, అని చెప్పాను కానా? నా మాట విని అలా చెయ్యండి. అదే సలహా. పీసిరిగొట్టు ముండాకొడుకు మా నలుగురికీ నాలుగు మూళ్ళు పజ్యెండు రాళ్లు పారేశాడు. యివి పెగిలేటప్పటికి నా తలప్రాణం తోకకి వొచ్చింది. నా వొంతు మూడూ మీకిచ్చేస్తాను. గురుజాడలు 351 కన్యాశుల్కము - మలికూర్పు