ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరణ్యం చేస్తాను. యీ లెక్చరు నేను కొట్టేసరికి, దేవుఁడు యేవఁంటాడో తెలిసిందా? వీడు అసాధ్యుణ్ణి వున్నాడు, వెనకటికి “పాతయముడివా? కొత్త యముడివా” అని అడిగిన పెద్ద మనిషి కంటే ఒక ఆకు యెక్కువ చదువుకున్నట్టు కనబడతాడు. గనక వీడికో జోడు గుజ్జాలబండీ యిచ్చి, స్వర్గంలో వున్న యావత్తు మహలులు, బగీచాలూ చూపించి, యేంకావాలంటే అది యివ్వండని దేవదూతలతో చెబుతాడు. నా శిష్యుడు వెంకటేశాన్ని కూడా తీసుకొస్తే గాని, నాకేం తోచదని నే చెబుతాను. అప్పుడు నిన్ను విమానమ్మీద తీసుకొస్తారు. మనవిద్దరం స్వర్గంలో మజా వుడాయిద్దాం. యీ వేళకి మతం మీద యింతవరకు లెక్చరు చాలును. యిక వెళ్లి దేవాలయం తోటలో కోతిపిల్లిని కట్ట ఆడుకో. సాయంత్రానికి నీ తండ్రి వొచ్చేసరికి మాత్రం, దీపం యదట కూచుని పుస్తకం తీరగేస్తూ పులుసటుకులు ధ్యానం చెయ్యి. యింగువవేసి బలే సొగుసుగా తయారు చేస్తాను (వెంకటేశం వెళ్ళును) రనెవే. (బుచ్చమ్మ ప్రవేశించి.) బుచ్చమ్మ: యీ రుబ్బురోలు నిండా తాటాకు ముక్కలు పడుతన్నాయి. యివతలకి లాగేసి పెడతారూ. గిరీ : అదెంతపని. (గిరీశం రుబ్బురోలు, పందిరి అవతలకు లాగును. బుచ్చమ్మ రుబ్బురోలు కడిగి మినపపప్పు రుబ్బును.) గిరీ : (పాడును) “భజగోవిందం, భజగోవిందం. గోవిందం భజమూఢమతే” యేం, వదినా, కంటనీరు పెడుతున్నారూ? బుచ్చ : యేవీఁ లేదు. గిరీ : మీరు కంటనీరు పెడితే నా మనుసు కలిగిపోతూంది. మహరాజులు మా కష్టాలు మమ్మల్నే బాధిస్తాయి. గిరీ : యేమి కనికరం లేని మాట అన్నారూ! మీరు అలా దుఃఖంలో ములిగి వుంటే, యెందుకు నాకీ వెధవ బతుకు? మీ కోసం యేం చెయ్యమంటే అదీ చాస్తానే? ప్రాణవిఁచ్చెయ్యమంటే యిచ్చేస్తానే? దాఖలా చూడండి యిదుగో కత్తిపీట! బుచ్చ : (కత్తిపీట దగ్గిర తీసుకుని) చెల్లికి యీ సమ్మంధం తప్పించారు కారు గదా? గిరీ అదొక్కటి మట్టుకు నాకు సాధ్యవైఁంది కాదు. బుచ్చ : మీకేం . గురుజాడలు 316 కన్యాశుల్కము - మలికూర్పు