ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : ఓరి ఛండాలుడా! హెడ్డుతో మాట్లాడ లేదన్నావే? కొండి : అవును మాట్లాళ్లేదు. రామ : ఫుండాఫోర్! మాట్లాడిందా మాట్లాళ్లేదా? కొండి : సచ్చాన్రా దేవుఁడా! రామ : అసత్యం అంటే, నాకు వెట్టి కోపం. ప్రమాణ పూర్తిగా, నిజం చెప్పు. అబద్దవాడితే, తల పేలిపోతుంది. మాట్లాడిందా లేదా? కొండి : లేదు. రామ : ప్రమాణ పూర్తిగా? కొండి : ప్రమాణ పూర్తిగానే. రామ : యిప్పుడు నిజం చెప్పావు. విన్నావా? నీకు చిన్నతనం; ఆడవాళ్ల మీద, ఒహరు అనమన్నా, అన్యాయం మాటలు ఆడకూడదు, తెలిసిందా? కొండి : మధురవాణి మా దొడ్డ మనిషి. రామ : వూళ్లీ అలా అనుకుంటారేం ? కొండి: అంతా అనుకుంటారు (రామప్పంతులు యింటి యెదట) రామ : నేను తలుపు కొడతాను. నీవ్వో చిన్న గమ్మత్తు చెయ్యి. కొండీ : చిత్తం. రామ : ఈ విచ్చ బేడ మొలని పెట్టుకో, మా పెరటి గోడ అవతల, ఒక అర ఘడియ నిల బడు. దిడ్డీతోవంట, కనిష్టబు గానీ, మరెవరు గానీ, పైకి వొచ్చినట్టాయెనా, రెక్కపట్టుకుని, కేకెయ్యి. నేవొస్తాను. లేకుంటే వుడాయించెయి. (కొండు బొట్లు నిష్క్రమించును. ) తలుపు తలుపు (తనలో) ఒకంతట తలుపు తియ్యదు. అనుమానాని క్కారణం. వీడు నిజం చెప్పాడా? అబద్ధం చెప్పాడా? నేను పాలెం నించి వొచ్చి కబురు పంపించిన తరవాత రాక, యిది తుజ్జుమని యలా పరిగెత్తి వెళ్లిందీ పెళ్లిలోకి? తలుపు తలుపు! యప్పటికీ రాదేం! (మధురవాణి తలుపు తీయును) యేం జేస్తున్నావు యింతసేపు? మధు : ఉదయం నుంచి రాత్రివరకూ చేసే పనులన్నీ, రేపటి నుంచి వ్రాసి వుంచుతాను రండి. (ఉభయులూ నిష్క్రమింతురు) కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 311