ఈ పుటను అచ్చుదిద్దలేదు

(రామప్పంతులు స్త్రీ వేషముతో నున్న శిష్యుణ్ణి రెక్క పట్టుకు తీసుకువచ్చును. అరచెయ్యి చూపించి) రామ : మావాఁ! యేం జొదా కొట్టుకొచ్చిందోయి నీకు! యిదిగో ధనరేఖ. చెయ్యి కొసముట్టి రెండో పక్కకి యెగబాకిరినట్టుందోయి. యివిగో సంతాన రేఖలు కంఠం దగ్గిర చూశావా. హారరేఖలు? లుబా : అట్టే పరిశీలన అక్కర్లేదు. చాల్లెండి. (పై ప్రసంగము జరుగుచుండగా మధురవాణి వెనక పాటున వచ్చి పంతులు నెత్తిమీద చెంబుతో నీళ్లు దిమ్మరించును. ) రామ : యేమిటీ బేహద్బీ! మధు : మంగళాస్నానాలు (శిష్యుడి గెడ్డం చేత నొక్కి) నీకు సిగ్గు లేదే లంజా? (మధురవాణి నిష్క్రమించును.) రామ : కోపవొస్తే మరి వొళ్లెరగదు. యిక కొరకంచో చీపురుగట్టో పట్టుకు వెంటదరువుఁ తుంది. యీ పిల్లని తీసుకు పారిపోదాం రండి. (శిష్యుడి చెయ్యి పట్టుకుని పైకి నడుచును.) లుబై : నడుస్తుంది. రెక్క వొదిలెయ్యండి. రామ : (రెక్కవదిలి) ఓహో! కాబోయే యిల్లాలనా? (ముగ్గురూ నిష్క్రమించి, వీధిలో ప్రవేశింతురు) లుబ్దా : యీ పిల్లని చేసుకోమని మీ అభిప్రాయవేఁనా? రామ : నా అభిప్రాయంతో యేం కార్యం? మీ మనస్సమాధానం చూసుకోండి. పిల్ల యేపుగా వుందా? రూపు రేఖా విలాసాలు బాగున్నాయా? అది చూసుకోండి. లుబై : సంసార్లకి సౌందర్యంతో యేం పని? (సిద్ధాంతి తొందరగా యెదురుగుండా వస్తూ ప్రవేశించి.) సిద్ధాం : (లుబ్ధావధాన్లతో) యవరు మావాఁ యీ పిల్ల? (లుబ్ధావుధాన్లు జవాబు చెప్పక, రామప్పంతులు వైపు బుజ్రతిప్పి సౌజ్ఞ చేయును. ) మావాళ్ళే సిద్ధా : (నిదానించి) భాగ్య లక్షణాలేంబట్టాయీ యీ పిల్లకీ! రామ : గురుజాడలు 301 కన్యాశుల్కము - మలికూర్పు