ఈ పుటను అచ్చుదిద్దలేదు

లుబ్ధా : పరాకు లేదు, గాని యిన్నాయి కొట్టుకుంటూంటే, యీ నాటికి పద్దెనిమిది వొందలకి, వక సంబంధం కుదిరి, తీరా క్రియ కాలానికి తేలిపోయింది గదా? యిప్పుడు చవగ్గా మనకి సంబంధం కుదురుతుందా? కుదరదు. కుదరదు. రామ : నిన్న వొచ్చాడయ్యా, గుంటూరు నించి ఒక బ్రాహ్మడూ. వున్నాడో వెళ్లిపోయినాడో? లుబై : : సంబంధానికా? రామ : అవును. యంత బుద్ధి తక్కువ పని చేశానూ! నా యెరికని యెక్కడైనా సంబంధం వుందా అని అతగాడు అడిగితే, లేదని చెప్పాను. యీ సంబంధం మీకు తప్పిపోతుందని నేనేం కలగన్నానా యేవిఁటి? అతడు జటాంత స్వాధ్యాయిన్నీ మంచి సాంప్రదాయవైఁ న కుటుంబీకుడున్నూ. ఆ సంబంధం చేస్తే అగ్నిహోత్రావుధాన్లుని చెప్పుచ్చుకు కొట్టినట్టాను. లుబై : బేరం యేం చెప్పాడు? రామ : బేరం మహా చవకయ్యా. అదే విచారిస్తున్నాను. అతగాడు గుంటూరు నుంచి వస్తున్నాడు. అక్కడి వాళ్లకి మన దేశపు కొంపలమ్ముకునే బేరాలతాపీ యింకా తెలియలేదు. అందుచేత నందిపిల్లిలో పన్నెండు వందలకి సంబంధం కుదుర్చుకున్నాడు. వ్యవధిగాగాని పెళ్లి కొడుకువారు రూపాయిలు యివ్వలేమన్నారట, ఆ బ్రాహ్మడికి రుణాలున్నాయి. వాయిదా నాటికి రూపాయలు చెల్లకపోతే దావా పడిపోతుందని యెక్కడయినా పిల్లని అంటగట్టడానికి వ్యాపకం చేస్తున్నాడు. ఒకటి రెండు స్థలాల్లో వెయ్యేసి రూపాయలకి బేరం వొచ్చిందట. పన్నెండు వందలకి గాని యివ్వనని చెప్పాడు. లుబై : మరొక్క వంద వేదాం మనం? రామ : అతగాడు వుంటేనా, నూరు వెయడానికి యాభై వెయడానికని? లుబ్ధా : కనుక్కుందురూ మీ పుణ్యం వుంటుంది. యెక్కడ బసో? రామ : దాని సిగ గోసిన డబ్బు, డబ్బు మాట అలా వుంబ్లీండి గానీ, ఆ పిల్ల యేమియేపు! యేమి ఐశ్వర్య లక్షణాలు! ధనరేఖ జెట్టిపోతులా వుంది. సంతాన రేఖలు స్ఫుటంగా వున్నాయి. పిల్ల దివ్య సుందర విగ్రహం. (మధురవాణి ప్రవేశించును.) మధు : గ్రహవేఁవింటి? రామ : గ్రహవేవిఁటా? అవుధాన్లు గారి గ్రహస్థితి చూస్తున్నాం. జాతకరీత్యా యీ సంవత్సరంలో వివాహం కాక తప్పదు. గురుజాడలు 299 కన్యాశుల్కము - మలికూర్పు