ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : అవును; నిజవేఁ. మీరు ముసలివాళ్లెతే మాత్రం? లుబ్ధా : అదుగో. 'ఐతేమాత్రం' అంటారేవిఁటి? నువ్వేపెట్టావు కాబోలు యీ పెంటంతాను. రామ : అన్ని పెంటలు పెట్టడానికి, మీ తమ్ముడు గిరీశం అక్కడే వున్నాడుకదూ? లుబ్ధి : వీడు, అక్కడెలా పోగయినాడయ్యా నాకు శనిలాగ? మధు : ఏమి! యీ మగవారి చిత్రం! యింతసేపూ పెళ్లి వొద్దని వరిస్తిరి; యిప్పుడు పెళ్లి తేలిపోయిందని వగుస్తున్నారు. నిజంగా మీకు పెళ్లాడాలని వుందండీ? లుబ్ధా : వుంటే వుంది, లేకపోతే లేదు. గాని యీ దుర్భాషలు నేను పడివూరుకుంటానా? మధు : మరేం జేస్తారు? రామ : యేంజేస్తారా? డామేజీకి దావా తెస్తారు. లుబ్ధి : దావా వొద్దు, నీ పుణ్యం వుంటుంది. వూరుకో బాబూ. రామ : కాకపోతే, యింతకన్న చవకైనదీ, సాంప్రదాయమైనదీ, సంబంధం కుదిర్చి, చేసుకున్నా వఁంటే, అగ్నిహోత్రావుధాన్లుని చెప్పుచ్చుకు కొట్టినట్టు వుంటుంది. లుబ్ధి : చవగ్గా కుదరడవెఁలాగ? మధు : నా మాటవిని పెళ్లి మానేసి వూరుకోండి. లుబ్ధి : యేం? ముసలివాణ్ణని నీకూ తోచిందా? యేవిఁటి? మధు : మీరా ముసలివాళ్లు? యవరా అన్నవారు? లుబ్ధా : నీకున్న బుద్ధి ఆ అగ్నిహోత్రావుధాన్లకి వుంటే బాగుండును. మధు : ఓ పన్ను కదిలిందా? కన్నుకు దృష్టి తగ్గిందా? చూడండీ మీ దండలు కమ్మెచ్చులు తీసినట్టు యలా వున్నాయో? రామ : (తన దండలు చూసుకొని) మావఁ పెరట్లో గొప్పు తవ్వడం నుంచి దండలు మోటుగా వున్నాయి; గాని నా దండలు సన్నవైఁనా ఉక్కు ఖడ్డీలు. మధు : (తన చీర కొంగుతో లుబ్ధావధాన్లు ఛాతీ కొలిచి) యెంత ఛాతీ! రామ : యేమిటీ వాళకం? మధు : వుత్తరం, మీలో మీరు చదువుకుంటారేం? పైకి చదవండి. రామ : నువ్వు నన్ను ఆజ్ఞాపించే పాటిదానివా? మేం చదువుకుంటాం. యివి ఆడవాళ్లు విన వలిసిన మాటలు కావు. నువ్వు అవతలకి వెళ్లు. గురుజాడలు 295 కన్యాశుల్కము - మలికూర్పు