ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : (చదువును) “శేవకుడు, తమ అత్యంత ప్రియ సోదరులు గిరీశం అన్కే నమస్కారములు చేసీ చాయంగల విన్నపములు, త|| యీ నాటికి వృద్ధాప్యంలో నయినా మీరు తిరిగి వివాహం చేసుకుని ఒక యింటివారు కావడమునకు నిశ్చయించితిరన్నమాట విని యమందానందకందళిత హృదయారవిందుడ నైతిని”. లుబా : వెధవ, వృద్ధాప్యవఁంటాడూ? మొన్నగాక మొన్ననే గదా యాభై దాటాయి. మధు : (దువ్వెన మొలను పెట్టి, లుబ్ధావధాన్లు జుత్తు ముడి వేసి) సంరక్షణ లేక యిలా వున్నారు గాని, యవరు మిమ్మల్ని ముసలివాళ్లనేవారు? రామ : (చదువును) “మీకు కాబోవు భార్య, నా ప్రియ శిష్యుండగు వెంకటేశ్వర్లు చెలియలగుటం జేసి నాకు బ్రహ్మానందమైనది. నేను అగ్నిహోత్రావధానులవారి యింటనే యుండి పెళ్లి పనులు చేయించుచున్నాడను. వారు నన్ను పుత్రప్రాయముగా నాదరించుచున్నారు. బహు దొడ్డవారే గాని చంద్రునకు కళంకమున్నటుల వారికి కించిత్తు ద్రవ్యాశా, కించిత్తు ప్రథమకోపముం గలవు”. వ్యాకరణం వెలిగిస్తున్నాడయ్యా గుంటడూ! - ఆ కోపం వొచ్చినప్పుడు మాత్రం యెదట పడకుండా దాగుంటే యెముకలు విరగవు. ప్రాణం బచాయిస్తుంది. మరేమీ ఫర్వా వుండదు - ద్రవ్యాశ అనగా, అది వారికి గాని మీకు గాని ఉపచరించేది కాదు. మీ వూరివారెవరోగాని ఒక తుంటరి, మీరు విశేష ధనవంతులనియు, పెళ్లి దేవదుందభులు మ్రోయునటుల చేతురనియు, వర్తమానము చేయుటను, యేబది బండ్ల మీద యీ వూరి వారి నందరిని తగ్గించుకు రానైయున్నారు. ఇంతీయకాక, దివాంజీ సాహేబు వారినడిగి, ఒక కుంజరంబునూ, మూడు కొట్టియలనూ, యేను గుఱ్ఱంబులం గూడ తేనైయున్నారు. బంగారపుటడ్డల పల్లకీ గూడ దెచ్చెదరు. దానిమీద సవారీణ, ఆలండౌ లత్తులతో వూరేగి, మీరు పెళ్లి చేసుకోవడం నాకు కన్నుల పండువే గాని, యిదంతా వృధా వ్యయం కదా, అని నాబోటి ఆప్తులు విచారిస్తున్నారు. యెద్దుపుండు కాకికి రుచి, రామప్పంతులు సొమ్మేంబోయింది?" వెధవ! నావూసెందుకోయి వీడికి? “యిందులో ఒక పరమ రహస్యం. అది యెద్దియనిన, యీ రామప్పంతులు చిక్కులకు, జాకాల్; తెలివికి, బిగ్ యాస్”. ప గురుజాడలు 289 కన్యాశుల్కము - మలికూర్పు