ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెళ్లాడుతాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే యంత యవ్వనములో నున్నా, యెంత సొగసుగానున్నా, మరివకడిని పెళ్లాడవల్ల లేదు. ఇది అన్యాయమంటావా, కాదంటావా? వెంక : తప్పకుండా అన్యాయమే. బుచ్చమ్మ : యేమండీ గిరీశం గారూ, వెధవలు పెళ్ళాడడం పాపం కాదూ? గిరీశం: ఆహా! మీ సత్యకాలం చూస్తే నాకు విచారంగా నున్నది. వెధవలు పెండ్లాడవలసినదని పరాశరస్మృతిలో స్పష్టంగా నున్నది. వేదంలో కూడా నున్నది. రాజమహేంద్రవరములో యిదంతా పండితులు సిద్ధాంతం చేసినారు. పూర్వకాలంలో వెధవలు పెండ్లాడే వారు, వెంకటేశం! నలచరిత్రలో దమయంతీ రెండో పెండ్లి సాటించిన పద్యం చదువు. వెంక : నాకు రాదు. గిరీశం: ఇంత ముఖ్యమయిన పద్యం మరచిపోవడం యంతతప్పూ! నోటుబుక్కు తీసి రాసుకో “దమయంతి రెండో పెళ్లికి, ధరనుండే రాజు లెల్ల దడడడవచ్చిరీ” - చూశావా! లోకంలో వుండే రాజులంతా వెధవని పెళ్లాడడానికి వచ్చారట, (బుచ్చమ్మ వైపు జూచి) చూశారా? శాస్త్రాలన్నీ వొప్పుకోవడమే కాకుండా మీది మిక్కిలి వెధవలు పెళ్లాడకుండా వుండిపోతే దోషమని కూడా చెప్పుతూ వున్నాయి. యిందు విషయమై శంకరాచార్యులవారు పత్రిక కూడా యిచ్చి యున్నారు. బుచ్చమ్మ : అయితే మనవాళ్లంతా వెధవల్ని పెళ్లి చేసుకోకూడదంటారే? గిరీశం: అదంతా యింట్లో చాకిరీ చేయించుకోవడము కోసరము గాని మరేమీ కాదు. ఝామురాత్రీ ఉందనగా లేచి మరునాడు రెండు ఝాముల రాత్రి దాకా యెద్దులాగు పనిచేయిస్తారు కదా? ఒక పూట కంటే యెక్కువ భోజనం చెయ్యనియ్యరు గదా? అప్సరస లాగున యెంత సొగసుగా నున్నా మంచిగుడ్డ కట్టుకోనివ్వరు. సరుకు పెట్టుకోనివ్వరు. తుమ్మెద పంక్తుల్లా వుండే జుత్తు కూడా తీసివేస్తారు గదా! ఫర్ ఏగ్జాంపిల్, మీ అక్కయ్యకు ఆ చంద్రబింబము వంటి ముఖము పైని ఒక కుంకుమ బొట్టుంటే త్రినేత్రుడికైనా చూడడానికి అలవి వుండునా? ఆహా ఈ అవస్థ చూస్తే నా హృదయం కరిగిపోతున్నది. ఆల్ రైట్! ప్రపంచములో యింకా యేమి వస్తువులువున్నవి? వెంక : చేగోడీలు. గిరీశం: డామ్ నాన్సెన్స్-ఎంతసేపూ తిండి విషయమయ్యే ఆలోచిస్తావు. బాచిలర్స్, బ్రహ్మ చారులు కూడా వున్నారు. వాండ్లు చెయ్యవలసిన పని యేమిటి? వెంక : వేదం చదువుకోవడం, పెయ్యలకి గడ్డి తేవడం కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 269