ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒక తృణం యిస్తారు. బుచ్చమ్మక్కూడా కొంచం డబ్బుంది. డెబిట్-దావా తెస్తే గాని అవుఁధాన్లు మావగారు దాన్లో దమ్మిడీ యివ్వడు. ప్రొజెండ్ కాన్సన్నీ విచారించగా, ఆవశ్యం విడోమారియేజి చేసుకుని తీరవలసిందే. అయితే సాధనవేఁవిటి? యేదైనా యాసెస్ బ్రిడ్జికట్టి వొడ్డు చేరాలి. (పైకి ముఖంయెత్తి ఆలోచించి) వెంకమ్మ, మొగుడితో దెబ్బలాడి నూతులో పడ్డప్పుడు నేను సాహసించి వురికి పైకి తీసిందగ్గిర్నుంచీ వూరంతా నేను సాక్షాత్తూ సత్యహరిశ్చంద్రుణ్ణిగా భావిస్తు న్నారు. అడుగడుక్కి బుద్ధి దాట్లేస్తూంటుంది గానీ, నేనంత వాణ్ణి కానా యేవిఁటి? స్నేహం పట్ల పీకిచ్చేస్తారే గిరీశంగారు! సాధారణులా? గనుక బుచ్చమ్మని మనం లావుచనుం చేసినా సుతిమించే వరకూ యవరూ తప్పు బట్టబోరు, రాత్రిళ్ళు అరబ్బీ నైట్లు, కాశీమజిలీలు, మదన కామరాజు కథలూ చెబుతూ వుంటే యంతో సరదాగా పక్కని కూచుని వింటుంది. లవ్ స్టోరీజ్ బుఱ్ఱకెక్కించాను. కొంత గ్రౌండ్ ప్రిపేరైంది గనక, యిహ విడో మారియేజి మంచిదని బోధపరుద్దాం. పాచిక పారినట్టాయనా, రాయవరం చలో, విడో మారియేజి కరో! లెట్ మీ బిగిన్ ది కాంపైన్ ఏట్ వన్స్! {తలుపు కన్నములోనుంచి తొంగి చూచీ) నడవలో కూర్చుని విస్తళ్లు కుడుతున్నది. మొట్టమొదట కొంచం మ్యూజిక్ విసురుదాము. (ఎటులోర్తునే చెలియా అను జావళీ కూనురాగముతో పాడి) బుచ్చమ్మ వదినగారూ తలుపు తీయండి. (బుచ్చమ్మ తలుపు తీయును) వదినా... వెల్.... వెంకటేశం యేమిచేస్తున్నాడు? బుచ్చమ్మ : పెరట్లో గొట్టికాయలాడుతున్నాడు. గిరీశం: ఈ వూరువస్తే మరి చదువు చెడిపోతుంది. పట్నంలో వున్నప్పుడు డస్కు దగ్గిర నుంచి కదలితే వొప్పేవాడను కాను. ఒక్కమాటు పి... పిలుస్తారా పాఠం చెపుతాను. (బుచ్చమ్మ తమ్ముని తీసుకొని వచ్చుటకు వెళ్లును. ) ఆహా! దీని తస్సాగొయ్యా, మొహం యెదటికి వచ్చేటప్పటికి కొంచం ట్రెంబ్లింగ్ పట్టు కుంటుంది. వకటి అనవలెనని మరివకటి అనేస్తూ యుంటాను. మరెవళ్లూ లేరు, వంటరిగా దొరికింది గదా. యీలాంటప్పుడు నా మనస్సులో మాట చెప్పేస్తే తీరి పోవునా! ఆ కోతి వెధవని తీసుకురమ్మని చెప్పాను. కానీ, పాఠాలలో చిన్న లెక్చరు వేతాము. (వెంకటేశ్వరులు, బుచ్చమ్మ ప్రవేశింతురు.) యేమివాయి మైడియర్ బ్రదర్ని వెంకటేశం, పాఠాలు చదవడం శుభ్రంగా మానివేశావు? యిక్కడ మరి మాసం రోజులు వుంటే వచ్చింది కూడా మరచిపోతావు. యేదీ టెక్టుబుక్కు పట్టుకురా. (వెంకటేశం పుస్త కము పట్టుకొని వచ్చును) గాడ్స్ వర్క్స్ అనే పాఠం తియ్యి. రీస్ఆన్ మై గుడ్ బోయ్. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 267