ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరట : కూచుందాం రా. శిష్యుడు : నా పేరేవిఁటండోయి? కరట : కొంప ముంచుతావు కాబోలు! సుబ్బి! సుబ్బి! మధురవాణి చూడగానే మతిపోయిందా యెవిఁటి? శిష్యు : దాని నవ్వు పట్టుబడాలని నిదానిస్తున్నాను. కరట : సబ్బు అన్నమాట జ్ఞాపకం వుంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం వుంటుంది. ( రామప్పంతులు గుఱ్ఱం దూరాన్నదిగి నడిచివచ్చి) రామ : (కరటక శాస్త్రితో మెల్లిగా) లోపలికెవరైనా వెళ్లారా? కరట : (గట్టిగా) యవరో యిద్దరు ముగ్గురొచ్చారు గాని మీ యిల్లాలుగా రొచ్చి పైకి పొమ్మని గెంటేశారు. రామ : మీరెవరు? యెందుకొచ్చారు? కరట : మాది కృష్ణాతీరం. నా పేరు గుంటూరు శాస్త్రుల్లంటారు. తమ దగ్గిర రాచకార్య వుండి వొచ్చానండి. వీధిలోనుంచి జవాను - "యినస్పెకటరుగారు నే వొచ్చిందాకా మజ్జి చెట్టుకింద గుజ్రాన్ని నిలబెట్టుంచుతావఁన్నారు. రూపాయలు వేగం యివ్వండి” (మధురవాణి ప్రవేశించును.) రామ : యవరు వొచ్చారట? మధు : యవరొస్తారు? మీ నాస్తులట ! తగిలాను. జవాను: రూపాయలండోయి. రామ : (మధురవాణితో) యేదీ మొన్న నీకిచ్చిన రూపాయలు? సాయింత్రం మళ్ళీ ఫిరాయిస్తాను. యీ సైతాను ప్రాణం తింటున్నాడు. మధు : మీరిచ్చిన రూపాయలు పట్టంతోలేశాను. నేను డబ్బిక్కడ దాచుకుంటే మా తల్లెక్కడ కాలక్షేపం చెయ్యడవెఁలాగ? రామ : వొట్ట బద్ధాలు! మధు : (తాళముల గుత్తి మొలలో నుంచి తీసి రామప్పంతులు మీద విసిరి) చూసుకోండి. రామ : (బుజం తడువుఁకుంటూ) దురహంకారం కూడదు! విసిరికొడితే దెబ్బతగల్దనుకున్నావా యేవిఁటి? కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 259