ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : అయినా ఆయన గుణ యోగ్యతలతో నాకేం పని? యేవఁయినా ఆయన నాకు యజమాని. ఆయన తప్పులు నా కళ్ళకు కనపడవ్. రామ : అయితే అతడికి విడాకులు యెప్పుడిస్తావు? మధు : యిక్కడి రుణాలు పణాలూ తీర్చుకోడానికి మీరు శలవిచ్చిన రెండు వొందలూ యిప్పిస్తే యీ క్షణం తెగ తెంపులు చేసుకుంటాను. రామ : అయితే యింద (జేబులోనుంచి నోట్లు తీసి యిచ్చును. మధురవాణి అందుకొంటుండగా రామప్పంతులు చెయ్యిపట్టి లాగును. మధురవాణి కోపంతో చెయి విడిపించుకుని నోట్లు పారవేసి దూరముగా నిలుచుఁను) మధు : మీతో కాలక్షేపం చెయ్యడం కష్టం. ఒక నిర్నయం మీద నిలవని మనిషిని యేవఁ న్నమ్మను? రామ : (నోట్లు యెత్తి) క్షమించు, అపరాధం, (నోట్లు చేతికిచ్చును) లెక్కపెట్టి చూసుకో. మధు : ఆమాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానేరాను. యింత రసికులయ్యుండీ నా మనస్సు కనిపెట్ట జాలినారు కారు గదా? మీ నోట్లు మీ వద్దనే వుంచండి. నేను డబ్బు కక్కూర్తి మనిషిని కాను. (నోట్లు యివ్వబోవును. ) రాము : వొద్దు! వొద్దు! వొద్దు! నీ మనసు కనుక్కుందావఁని అన్నమాట గాని మరొకటి కాదు. గాని, యీ గిరీశం గుంట వెధవ, వీడెవడో మా గొప్పవాడనుకుంటు న్నావేమిటి? మధు : ఆయన్ని నా యదట తూల్నాడితే యిదిగో తలుపు తీశాను విజయం చెయ్యండి (తలుపు తీసి వకచేత పట్టుకుని రెండవ చేతి వేలుతో పైకి తోవ చూపును). అదుగో గిరీశంగారే వొస్తున్నారు, ఆ మాటేదో ఆయన్తోటే చెప్పండి. రామ : వేళాకోళం ఆడుతున్నావూ? గిరీశం: (వాకట్లో నుంచి) మైడియర్. రామ : (ఆత్మగతం) అన్న, వేళగాని వేరొచ్చాడు. గాడిద కొడుకు, తంతాడు కాబోలు, యెవిఁ టి సాధనం, ఈ మంచం కింద దూరుదాం (మంచంకింద దూరును). (గిరిశం ప్రవేశించును.) గిరీశం : వెల్, మైడియర్ ఎంప్రెస్ (బుజము మీద తట్టబోవును. ) మధు : (ఒసిలి తప్పించుకుని) ముట్టబోకండి. గిరీశం: (నిర్ఘాంతపోయి) అదేమిటి ఆ వికారం. గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 225