ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎవరా వస్తున్నది! నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వర్లులా వున్నాడు. యీవాళ కిస్మిస్ శలవులు యిచ్చి వుంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫేలైనట్టు కనబడుతుంది. వీణ్ణి కొంచం వోదార్చి వీడికి శలవుల్లో చదువు చెప్పే మిషమీద వీడితో వీడి వూరికి వుడాయిస్తే చాలా చిక్కులు వొదుల్తాయి; అటుంచి నరుక్కు రమ్మన్నాడు. (వెంకటేశం ప్రవేశించును) యేమివాయ్ మైడియర్ షేక్స్పియర్, ముఖం వేల వేసినావ్? వెంక : యిక ఏర్నాతో మాట్లాడకండి. మా మాష్టరు మీతో మాట్లాడొద్దన్నాడు. మీ సావాసం చెయడం చాత నా పరిక్ష పోయిందని అన్నారు. గిరీ : నాన్సెన్స్, మొదట్నుంచీ నేను అనుమానిస్తూనే వున్నాను. నీ మాష్టరికి నన్ను చూస్తే కిట్టదు. అందుచాత నిన్ను ఫెయిల్ చేశాడు గాని, లేకుంటే నువ్వేవిఁటి ఫెయిల్ కావడవేఁవిటి? అతనికీ నాకూ యెందుకు విరోధం వొచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూసు పాప యేకేశాను. అప్పట్నుంచి నేనంటే వాడిక్కడుపుడుకు. వెంక : మీ వల్ల నాకు ఒచ్చిందల్లా చుట్ట కాల్చడం వొక్కటే. పాఠం చెప్పమంటే యెప్పుడూ కబుర్లు చెప్పడవేఁ కాని ఒక మారయినా ఒక ముక్క చెప్పిన పాపాన్ని పోయినారూ? గిరీ : డామిట్. ఇలాటి మాటలంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్ ఇన్స్టాటిట్యూడ్. నాతో మాట్లాడడవేఁ ఒక ఎడ్యుకేషన్. ఆ మాటకొస్తె నీకున్న లాంగ్వేజి నీ మాష్టరుకుందీ? విడో మారియేజి విషయమై, నాచ్చి కొశ్చన్ విషయమై నీకు యెన్ని లెక్చర్లు యిచ్చాను! నా దగ్గర చదువుకున్నవాడు ఒహడూ అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు దీ ఇలెవెన్ కాజస్ ఫర్ది డిజనరేషన్ ఆఫ్ ఇండియాను గూర్చి మూడు ఘంటలు ఒక్క బిగిని లెక్చర్ యిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయిపోయినారు. మొన్న బంగాళీ వాడు యీ వూళ్లో లెక్చరిచ్చినప్పుడు ఒకడికైనా నోరు పెగిలిందీ? మన వాళ్ళు వుట్టి వెధవాయలోయ్, చుట్ట నేర్పినందుకు థాంక్ చెయ్క, తప్పు పట్టుతున్నావ్? చుట్ట కాల్చడం యొక్క మజా నీకు యింకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్టగాల్చబట్టే కదా దొర్లింత గొప్పవాళ్ళయినారు. చుట్ట కాల్చని యింగ్లీషు వాణ్ణి చూశావూ? చుట్ట పంపిణి మీదనే స్టీము యంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబజ్ఞా? శాస్త్రకారుడు యేవఁన్నాడో చెప్పానే. సూత ఉవాచ క|| ఖగపతి యమృతము తేగా | భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్/ పొగ చెట్టె జన్మించెను | పొగతాగనివాడు దున్నపోతై బుట్టునూ|| యిది బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసంలో వున్నది. అది అలా వుణ్నీ గాని నీ అంత కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 220