ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంకటే: రాదు.

గిరీశ: (తనలో) అయితె లవ్ లెటర్సు ద్వారా కథనడిపించడముకు వీలులేదు.

(కరటకశాస్త్రి ప్రవేశించుచున్నాడు)

కరటక: మీకోసం వడ్డించి బుచ్చమ్మ కనిపెట్టుకవున్నది.

గిరీశ: యిదిగో వస్తున్నాను. (అని గిరజా సవరించుకొనుచు మీసములు కీటుకొనుచు లోపలికి వెళ్ళుచున్నాడు.)

(వెంకటేశ్వర్లు కూడా అతనితో వెళ్లుచున్నాడు)

శిష్యుడు : (తెరలో తేనిచి)

           సతత్రమంచేషు - మంచేషా కుంచేషా?
           పుస్తకం చూడాలి
           సతత్ర మంచేషు
           సతత్ర మంచేషు
           సతత్ర మంచేషు
           సతత్ర మంచేషు - మూడు పర్యాయములు వల్లెవేయడమైనది.
           మనోజ్ఞ వేషాం
           మనోజ్ఞ వేషాం
           మనోజ్ఞ వేషాం
           యింతసేపటికి పట్టుపడినది (కలిపి చదువుచున్నాడు)
           సతత్రమంచేషు మనోజ్ఞ వేషాం,

సహ - ఆ రఘు మహారాజు, తత్ర - అక్కడ, మంచేషు - మంచం అంటే మంచంగదా, "షూ" మాటకేమి. మనోజ్ఞ - మనోజ్ఞ మయినషువంటి, వేషాం - అక్కడ నట్టిపోయినది. యిది ఆ నాటకంలో వేషమో భాగవతవేషమో తెలియకుండా వున్నది. గురువుగారి నడగవలెను. (ప్రవేశించుచున్నాడు)

కరటక: అబ్బీ కొత్త శ్లోకము చెప్పనటరా?

శిష్యుడు: పాతశ్లోకము రువ్వేశాను.

కరటక: అయితే రెండు చిడప్పొక్కులు గోకు. (గోకుచున్నాడు)

యేదీ చదువు శ్లోకము.

శిష్యుడు: ఉదయానికి సాపుగా వచ్చింది గాని చల్దివణ్ణం తినగానే అడుగునపడి తెమలకుండా వున్నది. రాత్రల్లా రువ్వుతూనే ఉన్నాను. మీ చిడప్పొక్కులు గోకుతూ మీతో దేశాలంట తిరగడమే కాని మరి నాకు చదువు వచ్చేటట్టు కనపడదు.

గురుజాడలు

144

కన్యాశుల్కము - తొలికూర్పు