ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పిశాచాన్ని వదుల్చుకునేటప్పటికి తలప్రాణం తోక్కివచ్చింది. చీకటి పడింది. శీఘ్రబుద్ధే:పలాయనంఅని పెందరాళే ఈ వూరునుంచి వుడాయిస్తేనే కాని అబోరు దక్కదు. ఇక బయలుదేరి మహాలక్ష్మి ఇంటికి వెళ్ళవలెను. మేక్ హే వైల్‌ది సన్‌షైన్స్ అన్నాడు. (పైకి) పూజారివారి కోడలు తాజారగ బిందెజారి జర్రున పడియెన్. ఆ పైముక్క మరి జ్ఞాపకమువచ్చినది కాదూ. (చుట్టనోటిలో బెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించుచుండగా తెరదించి వేయవలెను.)

***

(౨స్థలము - కృష్ణరాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లుగారి నడవ)

(అగ్నిహోత్రావధానులుగారు కూర్చుని జంఝ్యాలు వడుకుచు కరటక శాస్త్రులు శిష్యునిచేత పేలు నొక్కించుకొనుచు వెంకమ్మ కూర తరుగుచు గనబడుదురు)

వెంకమ్మ : నిన్నటినుంచి కిసిమీశ్శలవులని కుర్రవాడు వుత్తరం వ్రాసినాడు. యెన్నాళ్లైందో చూచి కళ్ళు కాయలుకాచిపోయినాయి. గడియో గడియో వస్తాడు కాబోలు.

అగ్నిహో: ఎందుకు వట్టినే వగచడం. నేను వద్దు వద్దంటూంటే ఇంగ్లీషులో పెట్టావు. మెరక పొలంమీద వచ్చేశిస్తంతా వాడికింద ఖర్చుఅయిపోతున్నది. క్రిందటి సంవత్సరం పరీక్షఫేలు అయిపోయినాడు. మనకి ఇంగ్లీషు అచ్చిరాదని పోరి పోరి మొదటే చెప్పాను. మా పెత్తండ్రి దిబ్బావధానులు కొడుకుని ఇంగ్లీషు చదువుకు పార్వతీపురం పంపించేటప్పటికి వుష్ణంవచ్చి మూడు రోజుల్లో కొట్టివేశింది. బుచ్చబ్బి కొడుక్కి ఇంగ్లీషు చెప్పిందామనుకుంటూండగానే పెద్దఖాయిలా పెట్టిచచ్చినంతైంది.

వెంకమ్మ: మీరు యెప్పుడూ యిలాంటి వాగాయత్తం మాటలే అంచారు. డబ్బుఖర్చు అయిపోతుందని మీకు బెంగ. మొన్న మొన్న నాకళ్లయదట మన వాకట్లో జుత్తువిరబోసుకుని గొట్టికాయలు ఆడుకునేవాడు నేమానివారి కుర్రాడికి మునసబీ అయిపోయింది.

అగ్నిహో: మన వెధవాయికి చదువువచ్చేది యేమీ కనపడదుకాని పుస్తకాలకింద జీతం కింద ఇక నాలుగు యేళ్లయేటప్పటికి మనభూమి కడతేరిపోతుంది. ఆ పైని చిప్పా దొప్పా పట్టుకుని బయలుదేరాలి. నిమ్మళంగా ఇంటిదగ్గర వుంటే ఈ పాటికి నాలుగు అర్థాలు చెప్పివేదును. వొద్దంటూంటె యీ వెధవ ఇంగ్లీషుచదువుకింద పెట్టావు.

వెంకమ్మ : మనవాడికి ఒక మునసబు పనైనా, పోలీసు పనైనా అవుతే ఋణాలిచ్చి యీ అగ్రహారం భూములన్నీ కొనేస్తాడు. సాలుకు వక నూఱు రూపాయీలు ఖర్చుపెట్టడానికి ముందూ

గురుజాడలు

136

కన్యాశుల్కము - తొలికూర్పు