ఈ పుట ఆమోదించబడ్డది

డబ్బు చేతిలో వుంటేనే గాని సిగర్సుకి కొంచెము ఇబ్బందిగా వుంటుంది. నోట్‌బుక్కు, పెన్సలు తియ్యి:

  1. రోయల్ రీడర్.
  2. మాన్యుఅల్ ఆఫ్ గ్రామరు.
  3. గోషుస్ జ్యామెట్రీ.
  4. బాసూస్ ఆల్జిబ్రా.
  5. బాసూస్ అర్థమెటిక్కు.
  6. నలచరిత్ర.
  7. రాజశేఖర చరిత్ర.
  8. షెప్పర్డ్సు జనరల్ యింగ్లీషు.
  9. వెంకట సుబ్బారావ్‌స్ మేడిజీ.

యెన్ని పుస్తకాలయినాయి.

వెంకటే: తొమ్మిది పొస్తకాలయినాయి.

గిరీశ : మరొక్కటి వెయ్యి - కుప్పుస్వామి అయ్యర్సు మేడ్‌డిఫికల్ట్. అక్కడికి చాలును. మీవాళ్ళుగాని ఇంగ్లీషు మాట్లాడమంటే తణుకూ బెణుకూ లేకుండా పుస్తకాలలో వున్న ముక్కలు ఏకరపెట్టెయ్యి. నీ దగ్గిర యేమయినా కాపర్సు వున్నవా? బ్యాంకినోట్లు మార్చలేదు. వక పదణాలుపెట్టి మిఠాయి పట్టుకొనిరా. రాత్రి మరి నేను భోజనము చెయ్యను. మార్కట్‌కు వెళ్ళి బండి కుదిర్చేశి దానిమీద నా ట్రావెలింగు ట్రంక్ పడేసి మెట్టుదగ్గర బండి నిలబెట్టివుంచు. ఇక్కడ కొన్ని పనులు చక్కబెట్టుకొని యెంత రాత్రికయినా వచ్చి కలుసుకుంటాను. గో యట్ వన్స్ మై గుడ్ బోయ్. నీవు బుద్ధిగా చెప్పిన మాటలు వింటూవుంటే సురేంద్రనాధ్ బనర్జీ అంత గొప్ప వాడిని చేసేస్తాను. నేను నీతో వస్తానన్న మాట మాత్రం పిట్టకైనా తెలియనియ్యవద్దు.

(వెంకటేశ్వర్లు నిష్క్రమించుచున్నాడు)

గిరీశ: (తనలో) ఈ వ్యవహార మొకటి ఫైసలయింది. ఈ రాత్రి మహాలక్ష్మికి పార్టింగు విజిట్ యివ్వవలెను.

(పైకి) ఠవణింతున్నుతి కాలకంఠ మకుటాట్టాలప్రతోళీమిళత్యవమానామరశింధు బంధురపయ స్సంభార

(ఒక బంట్రోతు ప్రవేశించి.)

గురుజాడలు

134

కన్యాశుల్కము - తొలికూర్పు