ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆడపిల్లల పాటలు
పూర్ణమ్మ
- మేలిమి బంగరు మెలతల్లారా !
- కలువలకన్నుల కన్నెల్లారా !
- తల్లులగన్నా పిల్లల్లారా !
- విన్నారమ్మా యీకథను.
- ఆటలపాటల పేటికలారా !
- కమ్మని మాటల కొమ్మల్లారా !
- అమ్మలగన్నా అమ్మల్లారా !
- విన్నారమ్మా మీరీ కథను.
- కొండలనడుమను కోనొకటున్నది;
- కోనకి నడుమా కొలనొకటుంది;
- కొలనిగట్టునా కోవెలలోపల
- వెలసెను బంగరు దుర్గమ్మ.
- పూజారింటను పుట్టెను చిన్నది
- పుత్తడిబొమ్మా పూర్ణమ్మా;
- అన్నల తమ్ముల కనుగై దుర్గకు
- పూజలు పువ్వులు కోసేది.
- ఏయేవేళల పూసేపువ్వుల
- ఆయా వేళల అందించి
- బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
- పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
గురజాడలు
83
కవితలు