21
31 ఆంధ్ర దేశాభిమానీ, సీ. తనభాగ్యమును గనుంగొని యుల్లముననుబ్బి తబ్బిబ్బుపడు జమీందారుఁడొకఁడు తన సౌఖ్యమును జూచుకొని సారెసారెకు మదిఁబొంగిపడెడు సామంతుఁడొకఁడు తనవైభవము మెచ్చుకొని క్రిందుమీఁదుఁగా నక సంచరించు మాండలికుఁడొకఁడు శ్రేయముఁడలంచుకొని పి వీగుచు నొడ లెకుంగకయుండు నొడయఁడొకఁడు E గీ. అనదు స్వాతంత్ర్య సామ్రాజ్యధనములెంచి మిడిసి రాలిపడడు నెకిమిడొకఁడు దేశ హితమును గోరు పార్ణవుఁడు లేఁడె యనుచు వివరించు నాంధ్ర దేశాభిమాని. సీ, ప్రతిగ్రామమందుఁ దప్పక సంఘముల నేర్ప రిచి స్థితిగతులు జర్చింపరయ్య పంచాయతీన్యాయ పద్దతి నెలకొల్పి ప్రజల నెల్లర సౌఖ్య పర చరయ్య శాసననిర్మాణ సభ్యతార్హత గాంచ నెల్లవారలు బ్రయత్నింపయ్య పరిపాలనాభార పరిమితిఁదగ్గించి భూపాలురకుఁ దోడు చూపరయ్య గీ. రహిని రాజ్యాంగతంత్ర నిర్వహణశక్తి ప్రభువులకు జూపి మెప్పించి వారివలన గడిది స్వాతంత్ర్యిలాభంబుఁ బడయరయ్య! యనుచు నర్థించు నాంధ్రదేశాభిమాని. సీ. దైనికపత్రికల్ స్థాపింపవలెనన్న యుత్సాహసంపద యుద్భవించె కళలెల్ల వెలయింపఁగా విశ్వవిద్యాల యములు స్థాపించు నూహలం జనించె తెలుగు దేశంబు ప్రత్యేక రాష్ట్రంబుగా సకలాంధ్ర జనమహా సభగూర్చవలెనన్న గీ. కర్మశాలలు నెలకొల్పు కడకదోఁచె బ్రబలి జాత్య భీమానభావముగహించె సీ, దేశ భాషలలోనఁ దొలఁగు లెస్సయనంగా q విలయునన్నట్టి యాసలుదయించే సంకల్ప మల్లల్ల నంకురించె నెల్లయెడలను నవశక్తి పల్లవించే ననుచుఁ బులకించు నాంధ్రదేశాభిమాని. సాటి మించినది మా మేటీభాష జనులనే దార్యాతి శౌర్య గాఁభీర్యభా జనులగాంచింది మాజన్మభూమి శరణాగతత్రాణ సార్వభౌముల చేత ఖ్యాతికెక్కింది మాయాంధ్రజాతి సతులచే స' మానవతులచే నతుల సత్కీర్తినొందినది మా దేశమాత a_ 1 గీ, తనరు శ్రీ శైల కాళేశ దక్షవాటి కాది సుక్షేత్రముల చేత సనఘమై సు పూతమై భాసిలినది మాపుణ్యభూమి యనుచు శ్లాఘించు నాంధ్రదేశాభిమాని. బచ్చతోరణ సీ. లలిమీరు నిత్యకళ్యాణంబుఁ బచ్చితో రణముగల్గి కరంబుగ్రాలునట్లు పాడిపంటలుగల్గి పొడిమైఁబ్రజలెల్ల నుల్లాసమొదవ రఁజిల్లునట్లు విద్యాధనంబులు వృద్ధియైబహుభాగ్య భోగాలతోఁ దులఁదూగునట్లు స్త్రీల లుఁబూరుషులు సుస్థిరమైత్రిచేమించి యమిత సౌఖ్యముల మోలాడునట్లు గీ. వడిదురాచార భూతముల్ విడుచునట్లు రోగ దుర్భికు భయములు వీ గునట్లు కృపను గినింపవయ్య! లోకైకనాథ! యనుచుఁ బ్రార్థించు నాంధ్ర దేశాభిమాన, —మంగిపూడి వేంకటశర్మ.