పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.9 (1935).pdf/5

ఈ పుటను అచ్చుదిద్దలేదు

I % వినతిపత్రము మారేపల్లి రామచంద్రశాస్త్రి గారి పాదపద్మములసన్నిధికి కవివరా! గ్రంథాలయ సేవకాగ్రణీ! తమ షష్టిపూర్తిసందర్భములో నేడు జరుగు చున్న ఈమహోత్సవమున ఆంధ్రదేశ గ్రంథా లయసంఘపక్షమున మేము సభక్తికపణా మాంజలులతో తమ కీ వినతిపత్రమును సమ 'ర్పించుకొనుచున్నాము. ముప్పది నలువది సంవత్సరములకు పూర్వము గ్రంథప్రచారముగాని పత్రికాబాహుళ్యము గాని లేని ఆరోజులలో ప్రప్రథమమున జనసామా న్యమునకు విజ్ఞానజ్యోతి వెల్లివిరియించుచు గ్రంథాలయప్రచారము జరిపి తాము గ్రంధా లయోద్యమమునకు అంకురార్పణము గావించి నారు. పిమ్మట మరి ఎన్నెన్ని ఉద్యమములను చేపట్టినను ప్ర్రారంభించిన ఈమహాకార్యమును మాత్ర మేమరక నేటివరకుకూడ దీని అభివృద్ధి పరచుచు తా మనల్పముగ దేశారాధన మొన రించినారు. ఇట్లు మీరు చూపిన మార్గమునే అనుసరించుచు మేము ఓపినంతవరకు స్త్రం థాల యోద్యమమూలమున దేశ సేవ కావించు చున్నాము. ఒక్క గ్రంథాలయోద్యమమే కాకుండ తాము చేపట్టిన సంఖ్యాలతములైన ప్రజోప యోగి కార్యము లన్నింటిని జయప్రదముగా కొనసాగించి యావదాంధ ప్రపంచముయొక్క కృతజ్ఞతకును మన్ననకును తాము పాత్రులయి నారు. తాము ప్రదర్శించిన అమితోత్సాహము, త్యాగశ క్తి, కార్యదీక్ష మాకు నిరంతరము నూతనపటుత్వమును చేకూర్చి కార్యనిర్వహ ణకు పురికొల్పుచున్నవి. ఈనాడు మేము కార్య రంగమున అవలంబించుచున్న విధానములన్నిటి మీరు యందును మీ ఒరవడి విస్పష్టముగా కనుపింపక పోదు. ఉజ్జ్వలజ్ఞాన దీపికలు ధరించి ముందు దారిదీయు చుండ, అవేలమైన ఉత్సాహ ముతో మేము తమ అడుగుజాడలను అనుసరిం చుచు ఉండెదము. ఇట్లే ఇకముందుకూడ అనేక సంవత్సరములు తమ తేజస్సు మమ్ము దిద్ది తీర్చు టకు పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్యైశ్వ ర్యాభివృద్ధులు చేకూర్చుగాక! ! ఆంధ్ర దేశ గ్రంథాలయసంఘ సభ్యులు ! పశ్చిమ గోదావరిజిల్లా విద్యాశాఖాధికారి గ్రంథాలయములలో ఉండకూడదన్న 240 సాక్షి 241 " 242 " 243 " 244 " 245 " పుస్తకముల జాబితా. (డాక్టరు తేతలి సత్యనారాయణ, 312 ఇంగ్లీషువారి సంసార పద్దతులు సంసారపద్ధతులు తాలూ కౌగ్రంథాలయ సంఘ కార్యదర్శి.) 361 అకాలీలస త్యాగ్రహము 384 గాంధీమహాత్ముని చరిత్ర (గోవిందాచారి.) (మా. సత్యనారాయణ.) 385 " 387 మహా దేవ గోవింద రేనడే 400 ఆత్మకథ I (మహాత్మా గాంధి) 401 " II 402 కోయలచరిత్ర ""