1 " 7 ) గుంటూరు మండల దశమ గ్రంథాలయ మహాసభ, రేపల్లె మ क्ष అక్టోబరు, 1935. వెంకటగిరిరావుగా 8 ఆహ్వాన సంఘాధ్యక్షోపన్యాసము మంగళకరమగు నీసుముహూర్తమున విద్యా వంతులును దేశ సేవాపరాయణులు నగు మిమ్మా హ్వానించి యాదరించుటకు సమర్థులెందరో యుం డగా నా కీ యవకాశ మిచ్చినందులకు నేనా హ్వానసంఘమువారి కెంతయు కృతజ్ఞుడను. మీ వంటి మహాపురుషుల దర్శనము చేత మేమును, మా సోదర పట్టణవాసులును ధన్యులము. గమ్య స్థానము దూరమనక తమకుగల కార్యభారము లను సరకుగొనక, మాయాహ్వానముల నంగీక రించి, యీ సరస్వతీ పూజయందు మాతో భాగ స్వాములౌట కరుదెంచిన భాషాసేవకులకును, నుపన్యాసకులకును, సదస్యులకును సుస్వాగతము. మన రేపల్లెసీమ వాసియు, అఖండ త్యాగ మూర్తియు, దేశసేవా ధురంధురుడును, బహు భాషాకోవిదుడును, మన ఆంధ్రదేశనాయకులు ను, కీ॥ శే॥ ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య గారికి యిందుగా నామనఃపూర్వక వంద నము లర్పించుచున్నాను. వందలకొలదిఏండ్ల జ్ఞాతముగా బరువులెత్తిన వెనక భారతజాతీయత మరల తలయెత్తబూను కొను టెంతయు శుభస్కరము. అమెరికా, ఇంగ్లండు మొదలగు దేశములలో గ్రంథాలయోద్యమమే ప్రత్యేక జాతీయ నిర్మా ణమునకు కారణము. ఆయా దేశములలో జరిగిన మహ త్తర ప్రయత్నములగురించియు " కా ర్మిడీ” మొదలగు కోటీశ్వరుల మహాత్యాగము లను గురించియు నిచట వివరింపజాలనందులకు చింతిల్లుచున్నాను. దానిని గురించి చెప్పదలంచు కొన్నచో భారతమునకంటె పెద్ద గ్రంథమగుట యుప్రస్తు తాంశమును గూర్చి యుత్సాహాతురు లై యుప్రస్తుతాంశమునుగూర్చి యున్న మీ యమూల్యావకాశమును నేనవహ రింపవలసివచ్చుటయు యుక్తముకాదు. ఈయు ద్యమమునందు, బ్రిటిషు యిండియాయును, స్వ దేశ సంస్థానములు గూడ సమముగా పాల్గొన్నవి. కాని ఏయితర రాష్ట్రముగూడ బరోడా రాష్ట్రము తో సమానముగా ముందునకు రాజాలకపోవుట చిత్రము. బరోడా సంస్థానమువా రీ యుద్యమము నాదరించి ప్రభుత్వపక్షమున విద్యావంతుల నితర దేశములకంపి వారివిధానమును నేర్పించి గ్రం థాలయోద్యమమును ప్రభుత్వశాఖలలోనొకదా నినిగా చేయగలిగిరి. సంస్థానములోని ముఖ్యనగ రములలో గ్రంథాలయములు స్థాపించి సంచార గ్రంథాలయ పద్ధతిమీద పల్లెపల్లెకును విజ్ఞాన మును వెదజల్లిరి. నిజాం రాష్ట్రమున గూడ నేడు గ్రంథాలయములు విరివిగానే యున్నవి. ఒక్కింత ఆంధ్ర రాష్ట్రమును గురించి కూడ మనవిచేయు దును. ఆర్యవిజ్ఞానమువలె నీయుద్యమముగూడ దక్షిణాపథమున కరుదెంచినపుడు తెలంగాణము యొక్క ప్రాచీన విజ్ఞానము విస్మృతియవనిక నుండి వెలికి చూచినది. నశించి పోవుచున్న వారి విజ్ఞాన కోశముల నొక్కచో సేకరించి రక్షింప వలసిన యవసరము వారికి గోచరించినది. ఈతన్మ యతలో పల్లెపట్టణ భేదము లేకుండ నెన్ని యో ) థాలయములు నెలకొల్పబడినవి. ఈ గ్రం థాలయముల యభివృద్ధికి నైక్యతకు తోడ్పడు టకు గ్రంథాలయ సర్వస్వమను పత్రిక ప్రారం భింపబడినది. ఆంధ్రరాష్ట్ర కేంద్ర గ్రంథాలయ నిర్మాణప్రయత్నములు జరిగినవి. ఒక్కొక్కచో
పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.9 (1935).pdf/11
ఈ పుటను అచ్చుదిద్దలేదు