పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/7

ఈ పుటను అచ్చుదిద్దలేదు

3

అఖిలభారత గ్రంథాలయ మహాసభ. గాను గ్రంథాలయసంఘముల నధికముగస్థాపిం చుట, సమావేశములు జరుపుట యవసరము. గ్రంథాలయములనిర్వహణము, అందులకు గాను శిక్షణము పొందిన వారిచేతిలో నుండ వ లెను. గ్రంథ భాండాగారులకు శిక్షణ మొసగ ప్ర త్యేక పాఠ శాలలు స్థాపించి వారికి తగిన శిక్షణ మొసగవలెను. ఇవియును మరి అనేక సమస్యలు పరిష్కరించుటకు గ్రంథాలయసం ఘము లన్నియు శ్రద్ధ వహింపవలెనని కోరు చున్నాను. అధ్యక్షోపన్యాసము. కుమార మణీంద్రదేవ్ రాయిగారు, అధ్యక్షత వహించుచు ఆంధ్ర దేశమున గ్రం థాలయోద్యమము గాంచిన వ్యాప్తిని ప్రశం సించిరి. ప్రాచీన కాలమున నళందా, విక్రమ శిల, తమ శీలానగరములందు గల గొప్ప గ్రంథాలయముల నుదాహరించి ఆదర్శమందు నాటిXంథాలయములకును, నేటి గ్రంథాల యోద్యమముసకును గల భేదములను వివ రించిరి. నాటిXంథాలయములు విద్యాధి కుల కుద్దేశింపబడినవి. నేటి గ్రంథాలయో ద్యమము, జనసామాన్యమం దంతను విజ్ఞాన మును వ్యాపింపచేయుటకు యత్నించు చున్నది. ప్రజాసామాన్యమున గ్రంథపఠ నాభిమానము వ్యాపింపచేయుట కు కు ద్దేశింప బడినది. కలకత్తాయందలి “ఇంపీరియల్ " గం థాలయమును, భారత దేశమున కంతకును కేంద్ర గ్రంథాలయముగ నొనర్చుటకు గావిం పబడుచున్న ప్రయత్నములు సఫలమగుగాక! యని ఆశించిరి. నూతన గ్రంథాలయముల స్థాపనమునుగురించి ప్రసంగించుచు, ఆయా 3 స్థానిక పరిస్థితుల కనుకూలమగు పద్ధతులపై గ్రంథాలయములను స్థాపింపవలెనని నుడివిరి. ప్రభుత్వమువారు, సార్వభౌముని పరిపాలనా రజతోత్సవమును జరుపునపుడు దాని సం స్మరణార్థము కొన్ని గ్రంథాలయముల నేర్ప రుపవలెనని హెచ్చరించిరి. ప్రజలు గ్రంథా లయముల నేర్పరుచుకొనుటలోను, గ్రంథా లయోద్యమములోనికి పాక్షిక విరోధముల నేమాత్రమును దరికి చేరనీయరాదనిరి. గ్రం థాలయములు, అవసరములనుబట్టి, గ్రంథము లను పరస్పరము బదులిచ్చి పుచ్చుకొను పద్ధతి నవలంబింపవలె ననిరి. కారాగారములలోని ఖయిదీలకును, వైద్యశాలలలోని రోగుల కును, పామరజనులకునుగూడ ప్రత్యేక ముగ గ్రంథాలయముల నేర్పరుచుట అవ సర మనిరి. రెండవదినము. రెండవదినముఉదయమున అధ్యక్షులంద రును కలిసి, మద్రాసునందలి గ్రంథాలయ ముల నన్నింటిని దర్శించిరి. మధ్యాహ్నమున తిరిగి సభ జరిపి తీర్మానములను గావించిరి. తీర్మానములు, అన్ని రాజధానులలోను యోద్యమమును వ్యాపింపజేయుటకు వివిధ ధర్మగ్రంథాల రాష్ట్రములందలి చట్టనిర్మాణసభలు విశేష ధనము నొసంగవలెనని యీ సభవారు కోరు చున్నారు. స్థానిక సంస్థలును, పురపాలక సంఘము లును తమ పరిపాలన క్రింద ధర్మగ్రంథాల యములను స్థాపింపవలెనని యీ సంఘము వారు తీర్మానిం చుచున్నారు.