8
17 వ ఆంధ్రదేశ గ్రంథాలయమహాసభ
24, 25 డిసెంబరు, 1934
17 వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ డిసెంబరు నెల 24 వ తేదిన సాయంకా లము మద్రాసునగరమున కాంగ్రెసు మందిర మున సమా వేశమయ్యెను. అన్నామలై విశ్వవిద్యాలయమందుఆర్థిక శాస్త్ర పండితులగు డాక్టరు బి. వి. నారా యణస్వామిగారు ఈక్రింది ప్రారంభోపన్యాస మిచ్చిరి. మన దేశమున ప్రజలవిద్యావిహీనత బ్రహ్మాండమగు సమస్యగ నున్నది. దీనిని నివారించుటకు నిరక్షరాస్యులను అక్షరాస్యు లనుగ నొనర్పవలసియున్నది. అల్పవిద్యారం భకులగు ప్రజలు దానిని మరచిపోయి తిరిగి అవిద్యాంధ కారమున బడిపోకుండ కాపాడ వలసియున్నది. కాయకష్ట మొనర్చి జీవనో పాధిని సంపాదించు కొనవలసియున్న వ్యవ సాయకులకును, ఇతర పాటక జన సామాన్య మునకును, పాఠశాలల కరిగి విద్యాభ్యాస మొనర్పగల శక్తిగాని, సావకాశముగాని లక్ష్యముకాదు. అట్టివారికి వినోదకరము లును ఉత్సాహజనకములును అగు గ్రంథ ములు, గ్రంథ పఠనమునం దభిరుచిని గలిగించి విద్యోపార్జనాసక్తుల నొనర్పగలవు. విద్యా భ్యాసమునకు రాత్రి పాఠశాలలకుగాని, ఇతర వయోజన విద్యాశాలలకు గాని చనువారి కవి మరింత ప్రోత్సాహకరముగ నుండగలవు. కొద్దికాలములోనే మన దేశమున గొప్ప రాజ్యాంగ సంస్కరణలు ప్రారంభింపబడుచు న్నవి. ఆసంస్కరణలు జయప్రదమగుటకు వోటరులు, వ్యవహార పరిస్థితుల నెరిగి, దేశీయ సమస్యల బాగుగ దెలిసిన వారై యుండ వలెను. అపుడుగానీ వారు, తమవోటింగు హక్కును వివేకముతో నుపయోగింపజాలరు. ప్రజలలో విద్యావ్యాప్తి కలుగుటవలన, పరి శ్రమలును, పరిశ్రములయందలి కారి కార్మికుల శక్తిసామర్థ్యములును అభివృద్ధి గాంచును. ఆ విధముగగ్రంథాలయోద్యమము, దేశపారి శ్రామికాభివృద్ధికి గూడ చాల సాహాయ్య మొనర్చినడగును. విద్యావంతుల గుప్రజలు, తమపౌరవిధులను పౌరధర్మములను, పారిశుద్ధ్య విధులను బాగుగ గు ర్తెరుంగగలరు. ఈ విధ ముగ ప్రజలు తమ రాజకీయ బాధ్యతల గూడ సరిగ నిర్వహించుకొనగలరు. ప్రపం చమునందలి నాగరక దేశములన్నిటియందును - ప్రజలిపుడు, గ్రంథాలయోద్యమముయొక్క ప్రాముఖ్యమును బాగుగ గుర్తించియున్నారు. ఆంగ్ల దేశమున నూరుసంవత్సరములకు పూర్వ మేగ్రంథాలయోద్యమము ప్రారంభింపబడెను. అప్పటినుండియు ప్రభుత్వసాహాయ్యముతో డను, ప్రజల ఉత్సాహ కార్యగీక్షులవలనను గ్రంథాలయోద్యమ మా దేశమున బాగుగ వ్యాపించెను. గతశతాబ్దమందు రెండవయం భాగమున నార్వే, స్వీడన్, డెన్మార్కు, ఫ్రాంసు, జర్మనీ దేశములు ప్రజోపయోగము నకుగాను గొప్ప గొప్ప గ్రంథాలయములకు