హిందూయువజన సంఘము, ఏలూరు 29 న వారి కోత్సవము. ఈగ్రంథాలయముయొక్క వార్షికోత్స వము 21-10-84 తేదీన యం. లక్ష్మీనరసప్పు, యం. ఏ., స్ట్రెజరరీ డిప్యూటి కలెక్టరు గారి అధ్యక్షతక్రింద మిక్కిలి వైభవముగా జరిగి నది. అప్పుడు చదువబడిన గ్రంథాలయము యొక్క ని వేదికను ఈక్రిందవివరించుచున్నాము సంఘ చ రిత్ర . ఈ సంఘము 30 సంవత్సరముల క్రితము ది 23-9-1904 వ తేదీని ఉత్సాహవంతులగు యువకులచే ఏలూరు దక్షిణపు వీధిని స్థాపింప బడ్డారు. ఈ సంస్థానము చేసిన అమృతహస్తుడగు కీ. శే. దుగ్గిరాల సత్యనారాయణమూర్తిగారి సేవ ఈ గ్రంథాలయజీవనమునకు శ్రీకార మయినది. ఆయస మనకెల్లరకు చిరస్మరణీ యుడు. ది 6-11-1918 సంఠి ఈసంఘము రిజష్టరు చేయబడెను. వితరణశీలుడును, వినయ భావుడును, ధర్మకర్తసభాధ్యక్షుడునగు రా॥ బ॥ మోతే గంగరాజు జమీందారుడు ఏబది వేలరూప్యములు వెచ్చించి 1929 సం॥న ఈ దివ్యభవనమును దాన మొసంగి తనఔదా ర్యమును ప్రకటించెను. పరీక్షలు:- ఈసంఘప శ్రీ మున 6 వ తరగతి మొదలు 11వ తరగతివరకు విద్య నభ్యసించు చున్న బాల బాలికలకు వ్యాసరచనాపోటీ పరీక్ష జరుపబడెను. 178 బాలురు 2 బాలిక లురు హాజరు అయిరి. నీతిదాయకమగు నొకకథ - వ్యాయామము- విద్యార్థులు, వారివిధులు - గ్రంథపఠనము, కాలవిభాగము - సంఘ సేవ అనువిషయము al లందు పరీక్షింపబడినది; పదునొకండు బాలుర కున, ఒక బాలికకును బహుమతులియ్యబడెను. ఉప న్యా స ము లు, ఈవత్సరమున 5 ఉపన్యాసము లిప్పించ బడినవి. పి గ్రంథాలయాభివృద్ధికి ధనము ముఖ్యావ సరము. కనీసము ఒక లక్ష రూప్యము లై నను కావలెను. సంఘమునకు, సంఘమునకు, వచ్చు ఆదాయ మునకు మించిన వ్యయ మగు చున్నది. సంఘమునకు వలయు గ్రంథ రాజములను కొనుటకు ధనము చేకూరుటలేదు. అందుచే విరాళములను ధారాళముగా ప్రసాదింతురని విశ్వసించుచున్నాము.
- 90*
ఈ సంఘమున 1933 సంవత్సరాంతము నకు 365 సభ్యులు గలరు. 11,986 గ ములు గలవు. రు500/లని చ్చిన శాశ్వతధర్మకర్తలు 33రు ను, అంతకంటే తక్కువ మొత్తము నిచ్చిన వారు 42 రును కలరు. శాశ్వత ధర్మకర్తలు ఇచ్చిన సొమ్ముమీద సాలుగు రు1,000/లు ఆదా వచ్చుచున్నది. పత్రికలు:- ఆరు దినపత్రికలు, పండ్రెండు వారపత్రికలు పండ్రెండు మాసపత్రికలును వచ్చుచున్నవి. రు 204.4–0 విలువగల 367 గ్రంథములు దాతలవలన ఇయ్యబడినవి. ఆదా:- ఈవత్సరము ఆదా రు5891-11-6 లు. వ్యయము రు 5882 లు. S