75
11 ఇంపీరియల్ లై బరీ, కలకత్తా. వింజమూరి మదన గోపాలనాయుడు, వావిళ్ళ వేంకటేశ్వర్లు, గోవిందరాజా చారి, కోరాడ రామకృష్ణయ్యగార్లు గ్రంథాలయోద్యమ మును గూర్చి వ్రాసిన వ్యాసములు గలవు. వెల రు 2 లు. ఆంగ్లేయ ఆంధ్ర భాగములు వేరుగా దీసిన ప్రతిని గ్రామయూ లియనులకును పఁచాయతులకును ఉచితముగా పంపెదరు. ఇతర సంఘములకు పోస్టేజీ కొరకు రెండు అణాలబిళ్ళలను పంపిన పంపెదరు. మద్రాసు గ్రంథా లయ సంఘ నిబంధనలను ఉచితముగా బంపెదరు.
ఇంపీరియల్ లైబ్రరీ, కలకత్తా
OF9F ౧౯ ౨౮ సంవత్సరము ఏప్రియలు నెల మొదలు సంవత్సరము మార్చి నెలాఖరువరకు ఈగ్రంథాలయమునకు వచ్చిన చదువరులు 37750 నుంది. వీరివలన చదువబడిన గ్రంథముల సంఖ్య 2199. మిగిలిన వారందరును పత్రికలను చదివియుందురు. ఈ కాలమందు చదివిన గ్రంథములలో సారస్వతమునకు సం బంధించినవి 4269; చరిత్ర లో 2113; మతము 1816; జీవచరిత్ర 1287; ఆర్థిక శాస్త్రము 1222; పరిపాలన 1123; తత్వజ్ఞానము 1107; పత్రికాసంపుటములు 1868; నాణెములకు సంబంధించిన శాస్త్రము 14; జఁగమకథలు 32; భూగర్భశాస్త్రము 63, జంతు శాస్త్రము 67; గ్రంథ విభజన శాస్త్రము 71; వృక్షశాస్త్రము 78; ఆటలు 78; రసాయన శాస్త్రము 96; వ్యవసాయము 457; శాసనపరిశోధన 135; విద్య 517; వాసుశాస్త్రము 301; లలితకళలు 335; న్యాయ శాస్త్రము 908; గణితశాస్త్రము 228; వైద్యము 628; ప్రకృతిశా స్త్రము ము 410; సంఘసంస్కారము 87.