గ్రంథాలయ సర్వస్వము.
సంపు ౮. || బెజవాడ - నవంబరు 1929 || సంచిక ౫.
"గ్రంథాలయములు-ఆధునిక జీవితము
మన జీవితములో గ్రంథాలయములు యెటువంటి స్థానము నాక్రమించినది తెలిసికొనుట కనేక మార్గములు గలవు. అవి ఎటుల పెరుగుచున్నది, ఎటులు నడుపబడుచున్నది పరిశీలించిన తెలియును. ప్రధమమున వాటి సంఖ్య విషయము విచారింతము. గత 30 సం॥ల నుంచి ప్రపంచములో గ్రంథాలయముల సంఖ్య అనేక రెట్లు పెరిగినది. చెన్నపట్నములో సహితము వాటిసంఖ్య రెండు రెట్లధికమయ్యెను. ఏలనన 19వ శతాబ్దాంతమున కానిమర పబ్లిక్ గ్రంథాలయము, మద్రాసు లిటరరీ సొసయిటీ గ్రంథాలయము అను రెండు పెద్దగ్రంథాలయములుండెను. కాని యిరువదవ శతాబ్దమున మద్రాసు యూనివర్సిటీ గ్రంథాలయము స్థాపింపబడి అనేక విధముల వృద్ధిగాంచు చున్నది. ఇదిగాక నూతన పద్ధతులు కారము అచిరకాలముననే ఒక పెద్ద సార్వజనిక గ్రంధాలయమును స్థాపింపనున్నారట.
అనేక కొత్తమాదిరి గ్రంథాలయములు మన జీవిత కాలములోనే యుత్పన్నమయినవి. వీనివలన సర్వవిధములయిన మానవులకు గ్రంథాలయములయందభిరుచి కలిగినది. అందుచేత గ్రంథాలయముతో సంబంధములేని కులముగాని జాతిగాని మనము చూడము. అదియునుగాక గ్రంథాలయములు వ్యవధికలిగిన వారలకే గాక, నిముస మయిన విశ్రాంతి లేని గొప్ప వర్తకులకు కూడ అత్యావశ్యకము. రాను