పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.2 (1929).pdf/3

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము. సంపులా. బెజవాడ - ఆగష్టు ౧౯౨౯. సంచిక ౨.

ధర్మగ్రంథాలయము - వృత్తియందు త్రోవజూపుట.

దేశమునందలి యువకుల యొక్క నడవడిక యందు గ్రంథ భాండాగారి మంచి పలుకుబడిని గలిగియున్నాడు. వృత్తులనుగురించియు, వృత్తులయందు ప్రవేశించినపిమ్మట ఆజీవితము యొక్క అక్కరలను గురించియు అమూల్యమైన విషయములను గ్రంథాలయము దెలుప గలదు. వృత్తులయందు గ్రంథాలయములు యెట్లు సహాయము చేయ గలవు అని అనేకమందికి సందేహము గలదు. అందుచేత ప్రజాసామాన్యమునకు వృత్తులను ఏర్పరచుకొనుటయందు గ్రంథాలయములు యెట్లుతోడ్పడగలవో వివరింతుము. లాభకరమగు పనులయందు

వృత్తియందు సహకారమనగా, సామాన్యుడగు మనుజునకు అతడు తన జీవనోపాధిని నిర్ణయించుకొనుటయందు తోడ్పడుటయే! నియోగమైయున్న వారందరును తమ వృత్తులయందు ప్రవేశించినవారే యై యున్నారు. అందుచేత ఒక మానవుడు ఆతడు చేయుటకు యోగ్యమైయున్న పనిని అతడు కనిపెట్టు నిపెట్టా లాగున తోడ్పడుటయు, ఆపనికి కావలసిన మంచితరిబీతును సంపాదించుటయు, ఆతడు తరిబీతును పొందినదానికి ఒకపనిని సంపాదించుటయు, ఆతడు మేరుకొనిన వృత్తియందు అభివృద్ధిని బొందుటయు ఇది యంతయు వృత్తియందు త్రోవజూపుటయే యగుచున్నది. శ్రమప్రకారమును శాస్త్రోక్తమును అగు తొవను ఏర్పరచి జూపుటకు జేయు ప్రయత్నము విద్యావిషయమునం దొక కొత్త పోకడయై యున్నది. అమెరికా దేశ విద్యాప్రవీణుడొకడు సహజ వివేకముతో ఈత్రోవను