పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.2 (1929).pdf/16

ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 విశాఖపట్టణమండలియందు గల గ్రంథాలయముల చరిత్ర వ్రాయుటకు శ్రీయుత యామిజాల రామనరసింహంగారు (“మేనేజరు) కృషి సల్పుచున్నారు గావున ఆ యా గ్రంథాలయముల చరిత్రను, గుచో వాని ఛాయాపటములను యీ గ్రంథాలయమునకు బంపి మా యుద్యమమునకు తోడ్పడగలందులకు ఆ యా గ్రంథాలయముల యొక్క యజమానులను, భాషాభిమానులను యీ సంఘము వారు కోరుచున్నారు.

4 ఆంధ్రభాషాభివృద్ధికి తగువిధమున ప్రోత్సహించుచున్న పత్రికాధిపతులను గ్రంథమాల సంస్థాపకులను తమతమ పత్రికలను గ్రంథములను యిచ్చి గ్రంథాలయాభివృద్ధికి తోడ్పడవలయుననియు ఆంధ్ర దైనిక పత్రికను సగము చందాకు పంపవలెనని యేతత్పత్తి కాధిపతులగు శ్రీయుత దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావువంతు లుగారిని యీసంఘము వారు యేకగ్రీవముగా ప్రార్థించుచున్నారు.

5 ఈ తాలూకామొ త్తమున ముఖ్యమగు గ్రంథాలయ మిది యొక్కటియే కావున దీనిని ప్రోత్సహించి నుద్ధరించునిమి త్తము ప్రభు త్వమువారు తాలూకా బోర్డు స్కూళృనిమి త్తము యిచ్చు విరాళములో నుంచి తగుభాగము గ్రంథాలయమున కొసంగగలందులకు పార్వతీ పురం తాలూకాబోర్డువారిని విద్యానిధి యేర్పరచి యీ గ్రంథాలయ మునకు తగు వార్షిక విరాళము నొసంగుటకు సాలూరు యూనియన్ బోర్డువారిని దరఖాస్తులద్వారా యీసంఘమువారు కోరుచున్నారు. మీ

6 బోర్డుస్కూళ్ల మేస్టర్లు, ఎలిమెంటరీ స్కూళ్ళ మేనేజర్లు, టీచర్లు, విద్యార్థులు, గ్రంథాలయ నిబంధనలకు లోబడి' గ్రంథాలయ మును వినియోగపర్చుకొనుచు, దీనిపోషణార్ధము వారి కామ ఫండు లోనుండి విరాళములొసంగియు, సభ్యులుగా జేరియు, యీ యుద్యమ మును ప్రోత్సహిం చెదరు గాకయని తీర్మానించుచున్నారు.