పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.9 (1925).pdf/10

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర గ్రంథాలయ సర్వస్వము

ఎక్కువగా ఉపయోగించుకొనుట లేదు. ప్రతి గ్రామ మునకులు గ్రంథాయలమును స్థాపించు సౌకర్యములుండుట గుప్తరమగుటచేత 1918 వ సంవత్సరమునందు సంచారి గ్రంధాలయ పేటికల సంపుటనుగూడ ప్రారంభించిరి. ఇట్టిసంచార గ్రంథాలయ పేటికలను 77 పె పెట్టెలను త యారు చేయించి నానిని 77 గ్రామములకు పంపిరి.

ఈసంచార గ్రంథాలయ పేటికలను ఏగ్రామస్థు లైన తమ గ్రామ ఉపయోగాగమై కొనదలచిన యెడల సగము ఖరీదున కె ప్రభుత్వమువారు యిచ్చెదరు. ఆరోగ్యము. విద్య, అంటువ్యాధులు మున్నగు ఆకరవంతము లంగ A పల్లెటూరిజనులకు ఆకర్ష విషయములను గూర్చి మ్యాటక్కు లాంతరుతో ఉపన్యాసములిప్పించుటగూడ 1919 సంవత్సరమున ప్రారంభింప బడెను.

గ్రంథాలయ పరిపాలనము విద్యాశాఖ క్రింద గలదు. ఇ:దు కై ప్రత్యేకము ఒక " ఆర్గనైజరు " ఇద్దరు ఇనస్పెక్టర్లు ఒక ఉపన్యాసకుడు, సినిమా పశుపు వారొకరు గలరు. యుద్ధానంతరము జనుల వర్తకమునందు తగ్గుదల న్పించెను. అందుచేత ప్రభుత్వము వారి ఆదాయము కూడ తగ్గుట కారంభించెను. అందుచేత గ్రంథాలయముల కై ప్రత్యేకముగ నియమించిన ఉద్యోగులను తగ్గించిరి. పల్లె టూరు గ్రంథాలయముల అభివృద్ధికి జేయుచున్న సహా యమును గూడ తగ్గించి వేసిరి. a బెంగుళూరు, మైసూరు పట్టణములయందున్న గ్రం థాలయములకు గూడ కొంతసహాయము తగ్గింపబడెను. కాని అవి ఇంతవరకు జములయందు కలుగ జేసిన అభిరుచి వలన, జనులయొక, సహాయము అభివృద్ధి యయ్యెను. → మంచిదినము రాగానే, మైసూరు రాజు గారు తిరిగి గ్రంథాలయోద్యమమును రాజ్యమందఁతటను వ్యా పింప జేయుదురునుట కెంతమాత్రము సందియము లేదు.

పుదుక్కోట సంస్థానమందు గ్రంధాలయోద్యము

ఒక జాతియొక్క అభివృద్ధికిని సౌఖ్యమునకును ధర్మ గ్రంథాలయమువంటిది మరియొకటిలేదు. పుదుక్కోట పంపానమందుగల 441 గ్రామములలో 32 గ్రామములం దమాత్రము గ్రంథాలయములు, పఠనమందిరము, స్థాపిం పబడినవి, పల్లెటూరునందుఁడు ఉపాధ్యాయుడే గ్రఁధ భాండాగారిగా నుండుటకు తగినవాడు, అతఁడే దాని కాధారభూతుడు. ఆ సంస్థానమునందుగల దాదాపు అన్ని గ్రంథాలయములును వారివారి గ్రామములందు గల -శిపంతుళ్ల వల్ల స్థాపింపబడిన వైయున్నవి. వారిశ్రద్ధ వల్లనే వి పెంపొందుచున్నవి.

1. పట్టణములందు పెద్ద . ంథాలయములు గూడ గలవు. ట్టివి కూడు తాలూకా పట్టణములందు గలవు. పదు నెనిమిది సంచార గ్రంథాలయ పేటికలు విద్యా శాఖవారివలన ప్రచారమునకు దేబడుచున్నవి.

చదువుకొనజాలని జనులకు జ్ఞానమును గలుగజేయు టకై "కాల క్షేపములు, ఉపన్యాసములం మిక్కిలి ప్రయో జనకరములు . ఈ విషయమునగూడ యాగ్రంథాలయ ములు పాటుబడు చున్నవి.

ప్రత్యేకము స్త్రీలకొరకు రాజధాని పట్టణమునం దొకటియు తాలూ కాపట్టణములందు మూడును గ్రంథా జయములు గలవు. వానిని ఆయా గ్రామములందుగల ఉపాధ్యాయులే నిర్వహించుచున్నారు. వెంకట నర

కొద్ది మాసములక్రిఁదటనే శ్రీ సూరి సింహశాస్త్రిగారి అధ్యక్షత క్రింద అయిదవ గ్రంథా లయ మహా సభ జరిగినప్పటినుండియు యా సంస్థాన గ్రంథా లయోద్యమమునం దొక నూతనశకము ప్రారంభమైనది. సలహావలన కేంద్రగ్రంథాలయస్థాపనము జరుగు చున్నది.

గ్రంథాలయోద్యమమువలన సే జ్ఞానభిక్షు జనులకు లభ్య ము కాగలదు. గ్రంథాలయోద్యమమువలన సే జాతి అంతయు ఒకే మాటమీద నిలువబడగలదు. గ్రంథాల యోద్యమమువలన జీవసహిత మైనట్టియు, స్థిర మైనట్టియు, ఐకమత్యము చేకూరగలదు. గ్రంథాలయోద్యమము వలననే భారతవర్షము ఇతర జాతులయందు తన యర్ష స్థానమును పొందగలదు.