భటోద్యమ సంస్థాపనాచార్యుడు.
సేవావ్రత మనాది సిద్ధముగ భరతవర్షమున బ్రబలియున్నది. అయినను పాశ్చాత్య సాంప్రదా ఈ ప్రాబల్యమువలన జనులయం దు ధర్మబుద్ధి క్రమముగ వశించి పోయి సేవయం దుండెడి వాంఛ క్రమముగ తగ్గిపోవుచున్నది.
ఇటీవల పాశ్చాత్యులు గూడ ధర్మపరత్వముయొక్క మహత్తు ను దెలిసికొనినవారై సేవాప్రతి మునాచరించుటకై పలువిధము లఁ బాటుపడుచున్నారు. అట్టి ప్రయత్నములయం దెల్ల భటో ద్యమ మగ్రస్థానము నలంక రించి యున్నది.
ఈ యుద్యమమును ౧For వ సంబన సర్ రాబర్టు బేడెను పట్టెలు అను మహనీయునివలన ఇంగ్లాండు దేశమునందు ప్రారం భింపఁబడినది. దక్షిణాఫ్రికా యందు బోయరుయుద్ధము జరు గుకాలమున, పెద్దవారికన్న పిల్ల లే తమకిచ్చిన పనులను మిక్కిలి సామర్ధ్యముతో నెర వేర్పగలరని కనుఁగొనిరి. ఒక సేననుండి మఱి యొక సేనకు రహస్యపు సందేళ సర్ రా ములను గొనిపోవుపనికి, పిల్లలను నియోగించి చూచిరి, సా ధారణులగుమనుజులు ఈ కార్యములకు దిగుట కష్టతర ము, అ నేకా పదలపాలు కావలయును. ఒక్కొక్కసారి శత్రువుల చేతిలోఁజిక్కి హతము కావలసివచ్చును. బాల కు లిట్టికష్టములనన్నింటినియోర్చికొని బేడెజ్ పవెల్ గారి వెల్ చే|| నీయఁబడిన కార్యములను జయప్రదముగను అతి సామర్థ్య ముతోడను నిర్వహించిరి. బాల కుల ధైర్యసాహసముల కచ్చెరు వంది, వారికి సక్రమమగు నొక పద్ధతి నేర్పఱచి శిక్ష నిచ్చిన, వారు దేశమున కెంతో మహోప కారమును జేయఁగలరని యాయ నకుఁదోఁచెను. ఈయూహయే భటోద్యమమునకు ప్రథమ సో పాన మయ్యెను. అప్పటినుండి యు ఆయన తన యుద్యోగము నుగూడవిడచి పెట్టి యీ యుద్య మాభివృద్ధినిమిత్తమై నిరంతరము పాటుబడుచున్నారు. ఈ యు ద్యమ వ్యాపనార్ధమై ద్యమతత్వమును గూర్చి యనేక గ్రంధముల నాయన యున్నారు. యువకులకు సం బంధించిన విషయములను గూర్చి వ్రాయునది యొక పత్రిక - బా లుర విష యములను గూర్చి వ్రా యునది యొక పత్రిక - బాలికాభ టులను గూర్చి వ్రాయునది యొక పత్రిక - ఇట్లు వీరు వివిధతరగతుల యందుండు భటులకుఁ బనికివ చ్చుటకై ప్రత్యేకముగ పత్రికలను నిర్వహించుచున్నారు. ఏదేశమందైనను యీ యుద్యమ వ్యాపకమునందు వారి గ్రంథములే యాధారములై యున్నవి. వారియొక్క ప టమును యీ వ్యాసమునందుఁ జూడఁగలరు.