(2) కేంద్ర గ్రంథాలయము. బరోడా h ఆనందమయమైన యా ప్రేమరాజ్యంబు రాధరాణి నేలు నే రాధ పున్నెము పండు నే॥ నా మోహపుతున్న నా నోముల ఫలంబు నా నాధుడేల రాడే " cab కేంద్ర అయ్యయో నను వీడి పోయినా వే॥ నాజీవి తేశుండు నాదువలపుల పేడు నాకృష్ణుడేల రాడే అయ్యయో నను మరచిపోయినాడే॥ -బసవరాజు అప్పారావు, బి. ఏ.
కేంద్ర గ్రంథాలయము - బరోడా
బరోడా మహరాజు భారతవర్ష మందున్న స్వదేశ ప్రభువుల కెల్ల నాయకమణి. దివారాత్రములయం దెల్ల- చదువుచున్నను, వ్రాయుచున్నాను, మాట్లాడుచున్నను, నడుచుచున్నను ఎల్లప్పుడును గూడ,- “జనసామాన్యమును ఉద్ధరించుట ఎట్లు " అరు ఆలోచనయే ఆమహారాజు యొక్క మనస్సును వేధించుచుండును. అమెరికా దేశము ఔన్నత్య శిఖరాగ్రమును బొందుటకు ప్రాధాన్యముగ సహకారియైనది, దేశజులయందెల్ల ఆ క్తిగతమై యుండిన గ్రంథాలయ సంపదయేయని ౧౯౧౦వ సంవత్సరమున ఆ దేశమునకు బోయినప్పుడు, బరోడా మహరాజు గ్రహించెను. వెంట నే - స్వదేశమునకు తిరిగిరాకుండ నే- గ్రంథాలయోద్యమముచే తనరాజ్యమందుండు ప్రజల నెల్ల విద్యావంతులుగ జేయనెంచి, గ్రంథాలయ శాస్త్రవేత్తయగు బోర్డు దొరగారిని ప్రజల జీవితమువం దొక నూతనవికాసమును గలుగజేయ తనరాజ్యమున కంపెను; ఆయన బరోడా రాజ్యమున కేతెంచి, కేంద్ర గ్రంథాలయమును స్థాపించి, స్థిర మైన పద్ధతిని నిరూపించెను. ఇప్పుడది భారతవర్షమున కంతకును ఆశ్చర్యజనకమై, ఆదర్శప్రాయమై ఒప్పినది.
గ్రంథాలయమనగా “కొన్ని గ్రంథములను పత్రికలను ఒకచోట చేర్చి, జనులు తమంతటతాము వానినుపయో గింప విడుచుట" అనునభిప్రాయము మన దేశమునందు ప్రబలియున్నది. గ్రంధములను పత్రికలను ఒసంగుటకు మాత్రము ప్రాముఖ్య మియ్యగూడదు. దాని నొ సంగినంతమాత్రమున ప్రయోజనమేమియు లేదు. ఇచ్చిన దాని నెల్ల ఉపయోగింపజేయుటయే బరోడా కేంద్ర గ్రంథాలయముయొక్క నిరంతర ప్రయత్నమైయున్నది. తనదగ్గరనున్న వస్తువుల నెల్ల ఉపయోగింపజేయుటకు ఎల్లపుడును నూతన మార్గములను నెరుకుచునే యుండు ను. తనదగ్గరకు వచ్చు ప్రతిచదువరికిని ఒక పుస్తకమును సంపాదించి పెట్టుటయు-తనదగ్గరనున్న ప్రతిపుస్తకమునకు ఒక చదువరిని సేకరించుటయు ఆగ్రంథాలయముయొక్క నిత్యకృత్యములు. చదువుటయందు రుచిని ఎట్లు కలిగిం తును? ఎక్కువమంది జిజ్ఞానులు సెట్లు ఆకర్షింతును? వారికొఱతల నెట్లు తెలిసికొందును? ఆరోఱతల నెట్లు చదువరుల మనములకు గోచరింపకుండ వారి రుచులను, నిష్ప్రయోజన గ్రంధములనుండి ప్రయో జనకరములైన గ్రంధములమీదికి ఎట్లు మరలింతును? రాజ్యమునం దెల్లెడలను నూతన గ్రంథాలయములు బయ లు దేరునట్లు చేయు టెట్లు? అట్లు స్థాపింపబడినవాని నెట్లు ఉజ్జీవింపజేసి, కార్యకారులుగ చేయగలను? చదువజాలని వారి నెట్లు స్వాధీనపరుచుకొందును? బాలుర నెట్లు మోహింపజేతును? ఉపాధ్యాయులు, సంఘ సేవకులం మొదలగువారి ప్రీతిని, తోడ్పాటును ఎట్లు పొందెదను? గ్రంథాలయము సంఘమునకు కేంద్రస్థానముగను, జ్ఞాన