620 గ్రంథాలయ సర్వస్వము వెంటరాగ, బసలకు జేర్చిరి. ౬- వతేదీ ప్రాతఃకాలమున ప్రతినిధులందరును మ హేంద్ర తనయ నదియందు స్నాన ముజేసి, 'బా'జాభజంత్రీలతో గ్రామమంతయు నూరేగి సభామంటపమును జేరిరి. బోర్డు పాఠశాల భవనమునకు ముందున్న విశాలనుగు ఖాళీస్థలమునందు, వెయ్యిమంది జనమునకు సరిపోవు గొప్ప మంటపమును నిర్మించిరి. సభామంటపమంతయు పచ్చని తోరణముల తోడను, కదళీ స్తంభములతోడను అలంకరింపబడి కన్నులపండు వగ నుండెను. మద్రాసు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి, విశాఘపట్టణము, గంజాము మున్నగుజిల్లాల నుండి 300 మంది ప్రతినిధులును 900 మంది ప్రేక్షకు లును విచ్చేసిరి. సభనలంకరించిన ప్రముఖులలో కొందరి నామములు:-బుజ్జా శేషగిరిరావు గారు, రావుసా హేబు గిడుగు ఈ రామమూర్తిగారు, వెలిదండ శ్రీనివాసరావు గారు, జగన్నాధపాడిఖండం గారు, సెట్టి లక్ష్మీ నర సింహంగారు, బులుసు రామజోగారావుగారు, అయ్య గారి రామచంద్రరావు గారు, మల్లాది కృష్ణమూర్తి గారు, వి. గోపాలరావుగారు, నూరి వేంకట నరసింహం గారు, కుప్పా శ్రీరామశర్మగారు, బిక్కని వేంకట రత్నంగారు. ప్రధమమున సోంభోట్ల వెంకయ్యగారు సంస్కృత మున ప్రార్థనను సల్పిరి. పిమ్మట పుల్వల నారాయణ మూర్తి గారును కొందరు బాలురును భారతమాతను గూర్చియు ఆంధ్రమాతనుగూర్చియు జాతీయగీతములను బాడిరి, ఆహ్వాన సంఘాధ్యక్షులకు అన్నొప పరశు రామ దానుపాత్రొ గారు ప్రతినిధుల నాహ్వనము జేయుచు ఈక్రింది యుపన్యాసమును జ : - ఆహ్వాన సంఘాధ్యక్షుల యుపన్యాసము ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభయొ క్క చతుర్ధసమావేశ సందర్భమున గంజాంమండలము పక్షమున బారువ గ్రామమునందు మీకందరకు నాహృ దయపూర్వక స్వాగతము నిచ్చుటకై నాకవకాశము కలిగినందు కెంతయు ఆనందమగుచున్నది. ఈమందు వేసవికాలములో. తీవ్రనిదాఘతాపమునకోర్చి కడు దూరమునుండి మిక్కిలి ప్రయాసములతో బ్రయాణము | చేసి మాయాహ్వానమును గౌరవించి ఇచ్చటికి దయ చేసిన తీరు కెల్లడకు తగిన సౌకర్యములను కలుగజేయ లేనందులకు మిక్కిలి చింతించుచు లోపములను మన్నింప వేడుచున్నాను. కృష్ణ వేణీతీరమునందుద్భవించి, గౌతమి ఉత్తర పెనాకినీ తీరములందు ముద్దు ముచ్చటలను జరిపిన ఈఆంధ్ర దేశ గ్రంథాలయప్రతినిధుల సభను నాలవ యేట ఊసర క్షేత్రమున కాహ్వానించితిమని యనుకొన కుందురుగాక. ఈమండలము ఆంధ్రదేశము యొక్క ఉత్తర సరిహద్దును కలిగి యుండుట మాత్రమే గాక తామిప్పుడు సమావేశమయిన యీ బారువ గ్రామము, చరిత్రనుబట్టిచూడగా, సుప్రసిద్ధమయినదని మీకందరకు తెలియ జేయుటకు మిక్కిలి సంతసించు చున్నాను. ఈ గ్రామమునకు దక్షిణమున ప్రవహించుచున్న మ హేంద్రతనయ” యను పేడనొప్పు పుణ్యనది యిచ్చ టికి ౨౦ మైళ్ళదూరమున పశ్చిమము గానున్న మహేం దగిరినుండి యుద్భవిల్లి తిన పవిత్రోదకము చే చుట్టుపట్ల భూములను ఫలవంతముగను పవిత్రముగను నొనర్చుచు యీగ్రామమున సాగర సంగమమగుటచే పుణ్యదినము లయందు వేలకొలది జనుల నాకర్షించుచున్నది. పంచ పాండవులు అరణ్యవాసము చేసినప్పుడు ఈరు హేంద్ర గిరియందు కొంత కాలము గడపినట్లు ప్రసిద్ధి కలదు, వారొ కానొక నైమిత్తికపు దివసమున భోక్తలకు మాంసమికు టకై మహేంద్రగిరినుండి, వన్యమృగమునుకొని ఒక కపిలగోవును వేటాడిరి ఆ కపిలగోవు పడినచోటు యిప్ప టికిని "కపిలగుడ్డి” యను నామముతో ఈ గ్రామము వంటి యున్నది. దీనిచేరువనే స్మశానముగలదు. ఇచ్చట నే ప్రేతి సంస్కారమయిన మృతిక శేబరముల శల్యములు" బూడిద, మ హేంద్రనదిలో గలుపుటచే నాశల్యములు సగము శిలగను, సగము శల్యముగను యేర్పడునట్లు కను బడుచున్నని. కపిలగోవును సంహరించిన పాపనివార ణా ర్ధమైపాండవులు యజ్ఞమునొక దానినిసల్పి, జనార్ధనస్వా మిని కోటిలిం గేశ్వరస్వామిని,ప్రతిష్ట జేసి, బ్రాహ్మణులకు సువర్ణ దానము జేసినట్లు వాడుకగలదు. యజ్ఞము జరుప బడిన స్థలము శ్రీజనార్దనస్వామి వారి యాలయమున కు పశ్చిమమున (యజ్ఞ రిబట్టి " యను నామముతో యిప్పటి .
పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.3-4 (1918).pdf/28
ఈ పుటను అచ్చుదిద్దలేదు