17 రామమోహనధర్మపుస్తక భాండాగారము
శ్రీ రామమోహన ధర్మపుస్తక భాండాగారము - బెజవాడ.
౧౯౧౬ సం. ర వృత్తాంతము.
కొందఱు యువకులుకూడి స్వల్పచందాలు వేసికొని ౧౯ సంవత్సరమున స్థాపించిన ఈగ్రంథాలయము దినదినాభివృద్ధినొంది ఉన్నతస్థితికి రాగలుగు టెంతయు శేషకరము. ప్రారంభమునందు కార్యనిర్వాహకులు సంతో విశేషముగ అంతరాయములకు లోనయినప్పటికిని, పుర ప్రముఖుల యొక్కయు, ధనవంతుల యొక్కయు- అందు ముఖ్యముగ నడిమితిరువూరు జమీందారులగు కీతి శేషు లైన శ్రీరాజా వెల్లంకి చినవెంకట్రామారావు బహద్దరు జమీందారు గారియొక్కయు ప్రోత్సాహమువలన, ఈ భాండాగారము నిట్టి యభ్యుదయస్థితికి దేగలిగిరి. ప్రా సంభదశయందు కార్యనిర్వాహకులు పడిన కష్టనిష్ఠుర ములయొక్క పరిమితినిగూర్చి వ్రాయుటకన్న ఊహిం చుకొనుటయే సులభము.
౧౬ సంవత్సరము 93వ జనవరి ఉదయమున నూతన భవనప్రవేశ మహోత్సవమును నైజాము శాసన నిర్మాణసభ్యులగు శ్రీయుత పింగళి వెంకట్రామారెడ్డి దేశముఖ్ గారి యాధిపత్యముక్రింద జరిపితిమి. ఆనాటి మధ్యాహ్నమున రావుబహద్దరు రఘుపతి వేంకటరత్నం నాయుడు గారి యాధిపత్యముక్రింద ఐదవ వాషికోత్స వము జరిగినది. “ఆంధ్రవాఙ్మయము - దాని ప్రస్తుతస్ధితి”ని గూర్చి రాయప్రోలు సుబ్బారావుగారును, “దేశభాష ల”ను గూర్చి వల్లూరి సూర్యనారాయణరావు గారును, “ఆంధ్రోద్యమము”నుగూర్చి కొండపల్లి శ్రీరామచంద్రరా వుగారును ఉపన్యసించిరి. ప్రాచీనకాలము నందు దేవాల యములను మఠములను ఎట్టిభ క్తితో మనపూర్వులు ప్ర తిష్ఠించిరో అట్టి యుత్సాహముతోడను పట్టుదలతోడ ను నేడు మనము ధర్మగ్రంథాలయములను ధర్మవైద్యా లయములను నిర్మింపవలయుననియు, ఆంధ్రదేశ మధ్య భాగమునందున్న ఈ బెజవాడ పదిసంవత్సరముల క్రిందటి వరకును నిద్రావస్థయందుండి నేడు ఇట్టి గ్రంథాలయమును ప్రతిష్ఠింపగల యుత్సాహవంతుల నాక షి ౯ంచు ట చూడ దేశాభివృద్ధికి శుభసూచకముగ నున్నదనియు, ఈ గ్రంథాలయ నిర్వాహకులు చేయుచున్న పని దేశ మునందున్న ఇతరులకు మార్గదర్శకముగ నుండనోపునని యు డిప్పి, ఇట్టి యుత్సాహముతోడనే ముందు గూడ పనిజేయుదురు గాక యని యాశీర్వదించుచు శ్రీ వేంకట రత్నం నాయుడుగారు సభను ముగింపునకు దెచ్చిరి. ఆనాడు మధ్యాహ్నము విజయవాడ అన్న దాన సమా జమువారు మా యావరణయందు గింం మంది బీదలకు అన్న దాన మొనర్చిరి. మరునాటి ఉదయమున “శ్రీ గోపాలకృష్ణ గోఖలే” మహాశయుని ఛాయాపటమును రావు బహద్దరు వేంకటరత్నంనాయుడు గారు ప్రతిష్ఠిం చిరి. గోఖలే జీవితమును గూర్చి శ్రీ పేరి నారాయణమూ తి౯గారును దాసు త్రివిక్రమరావు గారును ఉపన్యసిం చిరి. ఈ పటమును శ్రీయుత కోట కృష్ణస్వామినాయు డుగారు స్వయముగా తయారుచేసి మాకొసంగిరి. ఆనా డు మధ్యాహ్నమున అయ్యంకి వెంకటరమణయ్య గారిచే, నియ్యబడిన మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకట రత్నం పంతులుగారి ఛాయాపటమును శ్రీ చిలకమతిక్షా - లక్ష్మీనరసింహముగారు ప్రతిష్ఠించిరి.
హిందూవిశ్వవిద్యాలయస్థాపకులును, స్వార్థత్యాగ మునకు మార్గదర్శకులును అగు శ్రీ దర్భాంగామహారాజు లుంగారు ౧౯౧౬ సం. జనవరి ౧ తేదీ ఉదయమున మాయాహ్వానము నంగీకరించి ఈ గ్రంథాలయమునకు విచ్చేసి, ఈ సంఘమును గౌరవించిరి. మఱియు జూలై నెల ౧౮ు తేదీ ఉదయమున, శాసననిర్మాణసభ్యులగు ఆసరబిల్ సర్ పి. యస్. శివస్వామి అయ్యరు గారు మాగ్రంథాలయమునకు విచ్చేసిరి. నవీన కాలమున గ్రం