పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/6

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
2

గ్రంథాలయ సర్వస్వము

 


7
సెలయేటి పాటకు ♦ జెవియొగ్గు పూవ
తుమ్మెద సఖులతో ♦ త్రుళ్లేడు పూవ
పైరగాలికి విచ్చి ♦ వర్ధిల్లు పూవ
రంగుల రాసివై ♦ రాణించు పూప
పోవటే! మాతల్లి ♦ పూజకో పూవ!
8
కళలకళ్యాణినే ♦ కమ్మని పూవ
సౌందర్య సరసివే ♦ చక్కని పూవ
భావాలబరిణవే బంగారు పూన
చిన్నెల చిలుకవే ♦ సింగారిపూవ
పోవటే ! మాతల్లి ♦ పూజకో పూవ!
9
పెరిఁగినా ! తరిగినా! ♦ ప్రియమేనె పూవ
చచ్చినా! బ్రదికినా! ♦ స్వర్గమే పూవ
ఓడినా! గెలిచినా! ♦ యొప్పేనె పూవ
తొలఁగినా! కలసినా! ♦ తోడేనె పూవ
పోదాము! ఆతల్లి ♦ పూజకేపూవ!

పూజ (పద్యములు)

1
చందమామ పూవెన్నెలల్ ♦ జల్లులాడ
బీళ్లు పులకరింపఁగ సెల ♦ యేళ్ళు పాడ
విశ్వమునఁ బచ్చతోరణాల్ ♦ విరిసియాడ
వేలవే! తల్లి మెడను పూ♦జాలలంతి!
2
బెదరు లేళ్ళును వెరపేది ♦ పొదలు వెడల
చిన్ని మొక్కలు సయితము ♦ చేవఁగ్రక్క
జీర్ణ మురళియు మ్రోగ ను ♦జ్జీవరుతుల
వ్రేలవే! తల్లి మెడను పూ♦జాలలంతి!
3
పొంగిపొడిచిన నదులెల్ల ♦ క్రుంగఁ జూచి క్రుంగఁజూచి
ఆకసముఁబ్రౌకు వరదగూ ♦ ళ్లణఁగ గాంచి
త్రుల్లి త్రోపాడు మేఘముల్ ♦ తొలగనరసి
వ్రేలవే ! తల్లి మెడను పూ♦జాలలంతి.
4
సస్యములకుఁ భాలిచ్చు వా♦త్సల్యవతులు
మంగళతరంగిణులు, ధీర♦భంగి చెప్ప
నాలకించితి భావర♦హస్య ములను
వ్రేలవే ! తల్లి మెడను పూ♦జాలలంతి!
5
చెరిగిపోని చక్కని లిపి ్ ♦జెక్కినారు
ఱాల భాగ్యభారత శాస♦నాల ఋషులు
వానదెబ్బల త్రుప్పుడు ♦ వాసై, చదివి
వ్రేలవే! తల్లి మెడను పూ♦జాలలంతి!
6
తెలుఁగు నెత్తుట వెలిఁగిన ♦ దీపకళలు
తెలుఁగుపాలఁ బేరిన మీగ♦డల తరకలు
తెలుఁగు తేనె తీయందన♦మ్ములుఁ దలంచి
వ్రేలవే ! తల్లి మెడను పూ♦జాలలంతి !
7
భక్తుఁడొక విగ్రహము తల♦పయిననుంచ
వీరుఁడొక ఆయుధము మీదఁ ♦ బెట్టి గొలువ
కర్షకు కుండొక కాడికిఁ ♦ గట్టి మ్రొక్క
వ్రేలవే! తల్లి మెడను పూ♦జాలలంతి !
8
కన్నె పసుపక్షుతలు సల్ల ♦ గౌరిపేర,
దేవి పేర కుంకుమను శా♦క్తేయులీయ,
విప్రులు సరస్వతీ దీక్ష♦ విరులొసంగ,
వ్రేలవే! తల్లి మెడను పూ♦జాలలంతి ! •
9
కవులు కవితా మధువుచే జగమ్ముఁ ♦ దడుప
శిల్పకులు కుంచియలఁ దేట ♦ తెలుపు దిద్ద,
గాయకులు గాత్రరక్తి రా♦గమ్ము లెత్త
వ్రేలవే! తల్లి మెడను పూ♦జాలలంతి!
10
పంజరములోని చిలుకల ♦ పాటలందు,
“అడవిలోని గోర్వంకల ♦ నుడులయందు
ఒక్కటే శ్రుతి చెదరక ♦ పిక్కటిల్లె
వ్రేలవే! తల్లిమెడను పూ♦జాలలంతి!