పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/24

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము


గ్రంథ విమర్శనము

“సతి”-“సావిత్రి”-“విదుషీమణులు”

మచిలీపట్టణములోని సరస్వతీ ని కేతనము వారిచే ప్ర చురింపబడిన సతి, సావిత్రి, విదుషీమణులను పొత్తము మాకార్యస్థాన మలంకరించినవి. సరస్వతిని కేతనము వారు మున్ను బాలుర కత్యంతో పయుక్తమగురీతి భక్తి యోగమను వంగీయపుస్తకమును తెనిగించి జనామోద మును వడసియుండిరి. వీరి నూతన ప్రయత్నములు భాలి కాపాఠశాలల కుపకరింప నుద్దేశింపబడుట మిక్కిలి కొనియాడదగి యున్నది. అందు సతి, సావిత్రియను పొ త్తములు ముద్దులమూటగట్టుగతి చక్కని కాకితముల మీద నింపగుకూర్పుతో మనోహరములగు రంగులపట ములతో ముద్రింపబడి యున్నవి. వీని ముద్రణము అం ధ్రగ్రంథ ప్రచురపద్ధతులందొక నూతనమార్గమును గల్పిం చినదనుట కెంతమాత్రము సందియము లేదు. బాలురకు ను బాలికలకును విద్యాసక్తి గలిగింపుటకుగాను, నువ్వు పూవులను చెంగల్వ మొగ్గలను పొ త్తములలో విస్తరించుచు మేలగు కథలను, దివ్యసుందరమనో సంపత్తిగల కథానా. యకులను చక్కని పాకమున చిత్రించి, మనోహరమ గు రీతి ముద్రించి చదివింపవలయునని “రస్కిను" మహ షి౯ ఉపదేశించియున్నాడు. అట్టి గ్రంధము లాంధ్ర పుస్తకమండలమున ఈనాటివఱకును లేని కొరంత సరస్వ తీని కేతనమువారి 'సతీ' 'సావిత్రు'లచే దీర్పబడినది. ఈ రెండుపు స్తకములును భాలి కాబాలురకు మనోహరములగు టయేగాక, వీనికధాంశములు హిందూదేశ నాగరిక సంసా రమున సుందరీమణు లుండవలసిన పగిది నిణయించు చున్నవి. సతి, సావిత్రి, సీత వీరి మువ్వురి చరిత్రముల తి లకించినచో హైందవ నారీలక్షణము నామూలముగ దే టవడును. భారతవష ణ మందలి నానా భాగములలో నీ మువ్వురు పుణ్యమూర్తుల చరిత్రలే నారీజనాదర్శములై నీతిబోధకములై యలరారుచున్న వి. వీనియాధారమున నే పాశ్చాత్య నవలలచే కలుషితములైన స్త్రీ పురుషాంత రంగములు పునీతములై, భవిష్యద్భారతవిభూతికిని జా తీయోద్ధరణకును మూల కారణములై ఫలింపగలవని నము చున్నాము. సతీ సావిత్రుల చరిత్రములు కడు సుందర 'మైనవి. వానిని సుందరమగురీతి యచ్చొత్తి, తెలుగు దేశమున కుపకారమొనర్చిన సరస్వతీని కేతనము వార్డు ప్రజాప్రోత్సాహమున కెంతయు నర్హులు. విదుషీమణులను చిన్ని పుస్తకములో హిందూదేశము న వేదయుగమునుండియు ఆధునిక కాలమువరకు వన్నె గని న విద్వన్నారీమణుల చరిత్రములును, వారిచే గావింప బడిన కృతుల ప్రశంసయు చెప్పబడియున్నవి. ఈ పుస్త కమును చదివిన బాలికలకు సారస్వత వ్యాసంగములం దభిరుచి కలుగకమానదు. ఈకాలమున ఆంధ్రదేశము • నందు స్త్రీ విద్య సచ్చారిత్ర ప్రబోధకము కాకున్నది. భౌతిక కళావిస్ఫూర్తియు కలిగింపకున్నది. ఇహమునకు పరమునకు వినియోగింపని పెట్టి దారుల నడచుచున్నది. ఇట్టి సందర్భములలో హిందూదేశమున సారస్వతోపా సన మొనర్చి, జాతీయవాఙ్మయమునకు మహోపకార మొనర్చిన నారీమణుల విద్వద్విభూతుల గుర్తెరుగుట కన్న మేలగు విషయ మేమున్నది? ఈ విదుషీమణుల చరిత్రలు బాలికలందరిచే జదివింపవలయును. (పు. సూ.) ఆం ధ్ర దేశము . సీ. చండప్రతాపరుద్రుం డనందగిన ప్రతాపరుద్రున కేది కాపురంబు రుద్రదేవీసమ రుద్రమదేవీ ప్ర, పూత చరిత కేది పుట్టినిల్లు సరిలేని మూరురాయర గండ బిరుదాంక, కృష్ణరాయల కేది గేహసీమ భోజసమాన విభ్రాజితకీర్తి రాజనరేంద్రునకు నేది జన్మభూమి మహితబుద్ధిశాలి. మనుమసిద్ధినృపాల, మౌళి కేది రమ్య కేళివనము ఖడ్గతిక్కనాది ఘనుల కేది నివాస, మట్టి యాంధ్రదేశ మలరుఁగాత. " —మంగిపూడి వేంకటశర్మ.