పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/12

ఈ పుటను అచ్చుదిద్దలేదు

Ε గ్రంథాలయ సర్వస్వము సుయోధను షులకుగల యభిమాన కౌశలములను జూపుచున్నవి. కా ని స్వధర్మానుష్టానమునందుఁగల అసిధారావ్రతమహత్త్వ మును బ్రదర్శించుటలేదు. అందువలన వీరు నాయకకక్ష్య నెక్కుదురను న్యాయములేదు. మిగిలిన యోధగణమం దు సుయోధనకర్ణులు ప్రధాన పురుషులు. నీ జీవితము క్లిష్ట విమర్శనకుఁ జోటిచ్చు దురంత గ ర్భితమైనది. సుయోధనునియందుఁ జక్రవర్తికుండవలసి న యుదారలక్షణములున్నవి. యోధునకుఁ గావలసిన బల సాహస ప్రావీణ్యము లున్నవి. కాని నీతియందు దక్షత తక్కువ. సాంప్రదాయ పధముల పట్ల ప్రమాణబుద్ధి స్వల్పము. ఆత్మగతియందలి విశ్వా సము కంటె నాప్తవచనమునందు నమ్మక మెక్కువ. అందువలన నే సుయోధనజీవితము మొదట శకుని దురూ హాయంత్రమందును, పిమ్మట కర్ణుని నిరంకుశసాహసగట నమునకును జిక్కి, ఎటుదిప్పిన నటు లాడినది. ఇతనికి పట్టుదలగలంత పరిశీలన లేదు. సంకల్పబాహుళ్యమంత భావసమృద్ధి కానరాదు. ఉత్తమచక్రవతి కేవల యో ధుఁడు కానేరఁడు. కేవల నైతికుఁడును గాఁబోఁడు. సామ్రాజ్యభోగమునందెంత ఏకగ్రీవమయిన ఆసక్తియు న్నదో, తత్సాధనాసాకల్యమునందంత నీతిప్రయోగ నై పుణ్యములు కావలెను. ఈ రెండును ఇందుసమ్మేళములు కాలేదు. మిగిలినవాఁడు ణ కర్ణుని భాగతనాయ కుని గాఁ జేయుట ఇతిహాసరచనా ధర్మమునకు విరుద్ధము కాదు. కాని భారతమువంటి "సంహిత"కు ఔచితిని తేఁ జాలదు. భారతకధాసంవిధానము నొకవలకుఁ బోల్చిన చో, కర్ణుడు దానికి' కొలికిత్రాడుగును కాని కన్నులలో నొకకన్ను గాఁడు. కర్ణుఁడు నిశితయోగ్యుఁడు. అందున కు సందేహము లేదు. అయితే అతనియోగ్యత "రణపా లన”మందు అసిధారావ్రతలకుణములతో విమర్శింపఁదగీ నది; కాని ధీరోదాత్త కావ్యనియమములతో నిరూపింపఁ దగినది కాదు. అట్టి నిరూపణకు వశము కాదనియే నావి - ధేయాశయము. కర్ణ జీవితమును ఉదా తభావముతోఁబ రిశీలించినచో ఖండితమయిన సిద్ధాంతము లేలదు. అశ్లీ ష్టనిష్పత్తి యుత్పన్న మగును. భారతపర్వముల యంద నేక స్ధలాంతరముల కర్ణుఁడు విషయనివాధిగాఁ బోషిం ' పఁబడి యున్నాఁడు. ఆపట్ల నెల్ల నొకరహస్యము బయ టపడును. కర్ణుఁడు సంశయగ్రస్తములగు భావములు కలవాఁడుకాడు. ఆతని సంకల్పమెంత దృఢమయిను దో, ఆతని క్రియాదృష్టియును అంతనిశ్చలమైనది. అం` దువలన నే తనకుఁ దోచినదెల్ల కార్యపరిణామమనియె వి శ్వసించెను. అఖండితముగా వారించెను. మతాంత రమును నిరసించెను. తెగఁబడి తత్కార్యసాధనమునకు దూకెను. కాని పర్యవసానమునందు అన్యధా భావవశుఁ డగుచు వచ్చెను. ఈతఁడు చెప్పినంత చేసియున్నచో, భీష్మాది రధికవర్గమునకు అంత చేటు నిరసన భావము దయిరీ చియుండదు. ఇట్లు చర్చించుటచే, అతఁడు చెప్పినంత చేయఁజాలనివాడని యర్ధముచేయఁగూడదు. ఇచటఁ బ్ర సక్తి కాయికశక్తి కాదు నైతికయు క్తి. కర్ణునియందు ఎన్ని గుణము లైననున్న వికాని మాత్సర్యము మాత్రము లేకపోతే లేదు. ఉదాత్త జ్వలితమగు నాతని గుణ తేజస్సు “పగ” పాలై పొగఁభౌతినది. కర్ణక థావిధానము ఎంతవఱకును బ్రచండముగ నుద్ఘాటింపదగినది కాని ప్రమధురముగ క ధనముఁ జేయఁజాలినది కాదు. ఏ సందర్భము నెట్లు సమ స్వయించినను ఈ మహావీరుని దృష్టియందు "పగ” పొగ రాజుచున్నట్లు ప్రదర్శింపకపోరాదు. ఈపగ ఎక్కడిదం దురా? కుమారాస్త్ర విద్యాసందర్శన ముహూత మందు అంకురించినదె. కావున కర్ణుని పరాక్రమము మాత్సర్య నైమిత్తికముగఁ బ్రకాశించినదనుట సామంజస్యమునకు దూరముకాదు. ఒకానొక పరచే ఏకపక్ష దీక్షితుఁడయిన యోధుని ఉభయకుల ప్రచారగర్భితమగు భారతమునకు బ్రధాననాయకుని జేయుట వలను పడదు. ఇఁక పాండవపక్షమునందుఁ గధానాయకత్వము వహింపఁదగిన వారు యుధిష్ఠి రార్జునులు. భీమాదుల నెం దుకువదలితినో కురుకులయోధవిమర్శన ధోరణిఁబట్టి సులువుగ నూహింపఁగలరు. ధర్మరాజు యుధిష్ఠిరునకు ధర్మరాజని నామాంతరము వాడిన వ్యాసుఁడు మిగులగడుసువాఁడు. ధర్మరాజును మొట్ట మొదట వేత్తగా వర్ణించినాఁడు. తరువాతఁ బ్రశాం. బ్రదర్శించినాఁడు. చివరకుఁ గేవలస్వార్ధనిస్పృ హునిగా వన్నె వేసినాఁడు. ధర్మజుని ప్రవతజనమందు. క్లిష్టమును అసందర్భమునగు విమర్శనీయవృత్తి లేకపోతే